NTV Telugu Site icon

Jyothi Rai : ఎన్టీఆర్ సినిమాలో నటించనున్న జగతి ఆంటీ..?

Whatsapp Image 2024 01 21 At 2.35.08 Pm

Whatsapp Image 2024 01 21 At 2.35.08 Pm

తెలుగు ప్రేక్షకులు బుల్లితెరపై వచ్చే డైలీ సీరియల్స్ అంటే ఎంతో ఆసక్తి చూపిస్తారు. తమకు ఇష్టమైన సీరియల్ వచ్చింది అంటే ఆ టైంలో ఎన్ని పనులు వున్నా పక్కన పెట్టేసి మరి టీవీల ముందు కూర్చుంటారు.వారు అందులోని పాత్రలను నిజ జీవితపు మనుషులను పోల్చుకుంటూ మరి చూస్తారు. ఇక సీరియల్‌లో నటించే నటీనటులపై ఎంతో అభిమానం చూపిస్తుంటారు. అలా ఎందరో అభిమానులను సంపాదించుకుంది గుప్పెడంత మనసు జగతి మేడమ్.స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు టాప్‌ సీరియల్స్‌లో ఒకటి. ఇందులో జగతి మేడమ్‌ పాత్ర రిషికి తల్లిగా, బాధ్యత గల టీచర్‌ గా మరియు ప్రేమించే భార్యగా ఎంతో చక్కగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. చీరకట్టులో ఎంతో హుందాతనంతో, అందంగా, తియ్యని మాటలతో చక్కని నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న జగతి అలియాస్ జ్యోతి రాయ్ గుప్పెడంత మనసు సీరియల్‌లో నటించడం ఆపేసింది.గుప్పెడంత మనసులో జగతి పాత్ర చనిపోవడంతో జ్యోతి రాయ్ తప్పుకుంది. కానీ, సీరియల్ తర్వాత సోషల్ మీడియా వేదికగా జ్యోతి రాయ్ చేసిన రచ్చ మాత్రం అంతా ఇంతా కాదు.

హాట్ హాట్ ఫొటోలతో అందాలను ఆరబోస్తూ యూత్ కి నిద్ర లేకుండా చేస్తుంది. ఆ ఫొటోలకు నెటిజన్స్ హాట్ గా కామెంట్స్ కూడా చేస్తున్నారు.. అయితే జ్యోతి రాయ్ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీసులతో ఫుల్ బిజీగా ఉంది.సినిమా ప్రమోషన్ల భాగంగానే జ్యోతి రాయ్ అలాంటి హాట్ ఫొటోలు పోస్ట్ చేసేదని సమాచారం. ఇక తాజాగా జ్యోతి రాయ్ పోస్ట్ చేసిన ఫొటో వైరల్ అవుతుంది..యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న మరో క్రేజీ మూవీ ఎన్టీఆర్ 31లో జ్యోతి రాయ్ నటిస్తున్నట్లు ఉన్న ఫొటోను ఆమె షేర్ చేసింది.జ్యోతి రాయ్ షేర్ చేసిన పోస్టులు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ 31లో జ్యోతి రాయ్ నటిస్తున్నట్లు ఎప్పటి నుంచి రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా జ్యోతి రాయ్ స్వయంగా పోస్ట్ షేర్ చేయడంతో ఆమె ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. ఈ న్యూస్‌కు హాట్ ఆంటీ మంచి ఛాన్స్ కొట్టేసింది, ఏం ట్విస్ట్ ఇచ్చావ్ ఆంటీ,జగతి మేడమ్ కంగ్రాట్స్ అంటూ ఆమె ఫ్యాన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు