Jyothi Rai : ఎన్టీఆర్ సినిమాలో నటించనున్న జగతి ఆంటీ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ప్రేక్షకులు బుల్లితెరపై వచ్చే డైలీ సీరియల్స్ అంటే ఎంతో ఆసక్తి చూపిస్తారు. తమకు ఇష్టమైన సీరియల్ వచ్చింది అంటే ఆ టైంలో ఎన్ని పనులు వున్నా పక్కన పెట్టేసి మరి టీవీల ముందు కూర్చుంటారు.వారు అందులోని పాత్రలను నిజ జీవితపు మనుషులను పోల్చుకుంటూ మరి చూస్తారు. ఇక సీరియల్‌లో నటించే నటీనటులపై ఎంతో అభిమానం చూపిస్తుంటారు. అలా ఎందరో అభిమానులను సంపాదించుకుంది గుప్పెడంత మనసు జగతి మేడమ్.స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు టాప్ సీరియల్స్‌లో ఒకటి. ఇందులో జగతి మేడమ్ పాత్ర రిషికి తల్లిగా, బాధ్యత గల టీచర్ గా మరియు ప్రేమించే భార్యగా ఎంతో చక్కగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. చీరకట్టులో ఎంతో హుందాతనంతో, అందంగా, తియ్యని మాటలతో చక్కని నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న జగతి అలియాస్ జ్యోతి రాయ్ గుప్పెడంత మనసు సీరియల్‌లో నటించడం ఆపేసింది.గుప్పెడంత మనసులో జగతి పాత్ర చనిపోవడంతో జ్యోతి రాయ్ తప్పుకుంది. కానీ, సీరియల్ తర్వాత సోషల్ మీడియా వేదికగా జ్యోతి రాయ్ చేసిన రచ్చ మాత్రం అంతా ఇంతా కాదు.
హాట్ హాట్ ఫొటోలతో అందాలను ఆరబోస్తూ యూత్ కి నిద్ర లేకుండా చేస్తుంది. ఆ ఫొటోలకు నెటిజన్స్ హాట్ గా కామెంట్స్ కూడా చేస్తున్నారు.. అయితే జ్యోతి రాయ్ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీసులతో ఫుల్ బిజీగా ఉంది.సినిమా ప్రమోషన్ల భాగంగానే జ్యోతి రాయ్ అలాంటి హాట్ ఫొటోలు పోస్ట్ చేసేదని సమాచారం. ఇక తాజాగా జ్యోతి రాయ్ పోస్ట్ చేసిన ఫొటో వైరల్ అవుతుంది..యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న మరో క్రేజీ మూవీ ఎన్టీఆర్ 31లో జ్యోతి రాయ్ నటిస్తున్నట్లు ఉన్న ఫొటోను ఆమె షేర్ చేసింది.జ్యోతి రాయ్ షేర్ చేసిన పోస్టులు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ 31లో జ్యోతి రాయ్ నటిస్తున్నట్లు ఎప్పటి నుంచి రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా జ్యోతి రాయ్ స్వయంగా పోస్ట్ షేర్ చేయడంతో ఆమె ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. ఈ న్యూస్‌కు హాట్ ఆంటీ మంచి ఛాన్స్ కొట్టేసింది, ఏం ట్విస్ట్ ఇచ్చావ్ ఆంటీ,జగతి మేడమ్ కంగ్రాట్స్ అంటూ ఆమె ఫ్యాన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!