NTV Telugu Site icon

Viral Video : అచ్చం సౌందర్య లాగే చేసింది.. ఆ అందాన్ని మళ్లీ చూసినట్టుందే.. వీడియో వైరల్..

Soundarya

Soundarya

అందం, నటన, డ్యాన్స్ ఇవన్నీ ఉన్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..మీనా, రమ్యకృష్ణ తర్వాత తనదైన అలరించిన హీరోయిన్ ఆమెనే. కన్నడకు చెందిన భామ.. మనవరాలి పెళ్లి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు లభించింది.. ఆరోజుల్లోనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఎవరో గుర్తు పట్టారా.. మరెవ్వరో కాదండి.. స్వర్గీయ నటి సౌందర్య..

తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆమె వెండితెరకు దూరమైంది. రాజకీయాల్లో ఓ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన సౌందర్య.. 2004లో హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించింది. దీంతో ఆమె మృతిని తెలుగు సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు.. ఇప్పటికి ఆమె మళ్లీ వస్తే బాగుండు అని అనుకుంటున్నారు.. ఆమె చేసిన ఒక్కో సినిమా ఒక్కో ఆణిముత్యం.. మహానటి సావిత్రి తర్వాత అంత అందమైన హీరోయిన్ ఎవరంటే సౌందర్య పేరే వినిపిస్తుంది. అంతలా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. సౌందర్య తెలుగుతో పాటు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది..

అయితే అచ్చం సౌందర్యలాగే అమ్మాయి సోషల్ మీడియాలో అలరిస్తోంది. మలేషియాకు చెందిన చిత్ర టిక్ టాక్‌ ఉన్న సమయంలోనే సోషల్ మీడియా స్టార్‌గా ఎదిగింది. చూడడానికి సేమ్ టు సేమ్ మన సౌందర్యలాగే ఉండడం ఆమెకు కలిసొచ్చింది. చిత్ర తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మనదేశంలోని అభిమానులకు సైతం దగ్గరైంది.. ఇటీవల చిత్ర ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నది.. ఎన్నో విషయాలను తెలియజేసింది.. ఇక తాజాగా మరో వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో నెట్టింట ట్రెండ్ అవుతుంది..