యువ హీరో కిరీటి రెడ్డి, శ్రీలీల జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా ‘జూనియర్’. జులై 18న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. రాధా కృష్ణ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సీనియర్ నటి జెనీలియా కీలక పాత్ర పోషించారు. ‘వైరల్ వయ్యారి’ పాట వైరల్ అయినా.. సినిమా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. జూనియర్ సినిమా సెప్టెంబర్ 22న ఓటీటీలో విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల స్ట్రీమింగ్‌కు రాలేదు. తాజాగా కొత్త తేదీని ‘ఆహా’ ప్రకటించింది.
Also Read: MacBook Air M4: కొనుగోలుకు ఇదే సరైన సమయం.. డెడ్ చీప్‌గా యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్!
సెప్టెంబర్ 30 నుంచి జూనియర్ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని ఆహా తెలిపింది. ‘సీనియర్‌కి సెమిస్టర్ పరీక్షలున్నాయి. జూనియర్ ఈ నెల 30న వస్తున్నాడు. జూనియర్ మూవీ సెప్టెంబర్ 30న స్ట్రీమింగ్’ అని ఆహా వీడియో ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల అవుతుంది. జూనియర్ కన్నడ వెర్షన్ నమ్మ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాతో గాలి జనార్దనరెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సినిమా ఫలితం ఆయన్ను నిరాశపరిచినా.. యాక్టింగ్ విషయంలో మాత్రం మంచి మార్కులే పడ్డాయి.
