NTV Telugu Site icon

IPL 2023: నరాలు తెగే ఉత్కంఠ.. కన్నీళ్లు పెట్టుకున్న జుహీ చావ్లా

Juhi Chawla

Juhi Chawla

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు సంచలన విజయం సాధించింది. కేకేఆర్ విజయంలో ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్ కీలక పాత్ర పోషించాడు. ఆఖరి ఓవర్ లో కేకేఆర్ విజయానికి 29 పరుగులు కావల్సిన నేపథ్యంలో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన రింకూ.. తమ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఆఖరి బంతికి సిక్స్ బాదగానే.. కేకేఆర్ డగౌట్ మొత్తం సంబరాల్లో మునిగి తెలిపోయింది. కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు మైదనంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి తమ జట్టు హీరోను భుజాలపై ఎత్తుకుని మరి అభినందించారు.

Also Read : War 2: మాస్ యాక్షన్ ఫిల్మ్ లోకి ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ ఎంట్రీ?

ఈ క్రమంలో స్టాండ్స్ లో కూర్చుని మ్యాచ్ వీక్షించిన కేకేఆర్ కో-ఓనర్, బాలీవుడ్ సీనియర్ నటి జుహీ చావ్లా.. తమ జట్టు గెలవడంతో భావోద్వేగానికి లోనింది. ఆమె తన భర్త జే మెహతా.. కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ విన్నింగ్ సెలబ్రెషన్స్ జరుపుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ మ్యాచ్ లో 21 బంతులు ఎదుర్కొన్న రింకూ సింగ్ ఒక్క ఫోర్ ఆరు సిక్సులతో 48 పరుగులు సాధించాడు.. దీంతో కేకేఆర్ ఈ మ్యాచ్ లో ఘన విజయం సాధించింది..కాగా కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్ లో ఏప్రిల్ 14న సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. రింకూ సింగ్ లాస్ట్ ఓవర్లో కొట్టిన ఐదు సిక్స్ లు సోషల్ మాడియాలో వైరల్ గా మారింది.

Also Read : Crime: మా వాళ్ల అమ్మాయినే ప్రేమిస్తావా.. పట్టపగలు యువకుడి దారుణ హత్య

Show comments