Site icon NTV Telugu

Hyderabad: జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి కత్తులతో దాడి చేసి చోరీకి యత్నం.. వాచ్‌మెన్‌ యే దొంగ..

Bank Robbery

Bank Robbery

Hyderabad: జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు కత్తులతో దాడి, దోపిడీకి యత్నించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో జూబ్లీహిల్స్ పోలీసులు సకాలంలో చేరుకోవటంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. నిందితుడు ఎవరో కాదు.. ఆ ఇంటికి చాలా కాలంగా కాపలాకాస్తున్న వాచ్‌మెన్‌ అని తెలిసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందో పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం..

READ MORE: Erika Kirk: జేడీ వాన్స్‌ను అందుకే కౌగిలించుకున్నా.. ఎరికా కిర్క్ క్లారిటీ

పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్‌లో నివసించే అజయ్ అగర్వాల్ ఇంట్లో చాలాకాలంగా రాధాచంద్(40) కాపలాదారుగా పనిచేస్తున్నాడు. యజమాని ఇంట్లోనే దోపిడీ చేయాలని మరో ఐదుగురితో కలిసి పథకం పన్నాడు. శనివారం అర్ధరాత్రి రాధాసింగ్ మిగితా వారితో కలిసి కత్తులు, తాళ్లతో అజయ్ అగ ర్వాల్ ఇంటికి చేరుకున్నాడు. ముందుగా ఇంటి ఆవరణలోని గదిలో ఉన్న డ్రైవర్ దయాచంద్‌ను తాళ్లతో బంధించే క్రమంలో అతడు ప్రతిఘటించాడు. వారు కత్తితో దాడిచేసి అతడిని తీవ్రంగా గాయపరిచారు. తాళ్లతో కట్టేసి నేరుగా అజయ్ అగర్వాల్ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంట్లోని కుటుంబ సభ్యులంతా భయంతో వణికిపోయారు. జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే అక్కడికి చేరుకున్నారు. దోపిడీకి యత్నిస్తున్న రాధాచంద్ పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన డ్రైవర్ దయాచంద్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Exit mobile version