Site icon NTV Telugu

Xora night club: ఎంజాయ్ కోసం మరీ ఇంత దిగజారడమేంటి..?

Night Pub

Night Pub

మనుషుల ఎంజాయ్ మెంట్ కోసం వన్యప్రాణులను కూడా వాడేసుకుంటున్నారు. అడవిలో స్వచ్ఛమైన గాలి, వాతావరణంలో తిరగాల్సిన వన్య ప్రాణులు.. పబ్బుల్లో సిగరెట్లు, మద్యం వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మాములుగా అయితే పబ్ కు వచ్చిన వాళ్లు డ్యాన్స్ లు, పాటలతో ఎంజాయ్ చేస్తుంటారు. కానీ అక్కడ మాత్రం వెరైటీగా వన్యప్రాణులతో ఎంజాయ్ చేస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు జోరా పబ్ నిర్వహకులు చేస్తున్న తతంగం బయట పడింది.

Also Read : Aghora Puja: మృతదేహంపై కూర్చొని అఘోరా పూజలు

హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని జోరా నైట్‌ పబ్‌లో గత ఆదివారం (మే 28) వన్యప్రాణులను ప్రదర్శించారు. కస్టమర్లను ఆకర్షించేందుకు పబ్‌ నిర్వహకులు ‘వైల్డ్ జంగిల్ పార్టీ’ పేరిట ఈవెంట్ జరిపిన ప్రొగ్రాంకు వన్యప్రాణులను తీసుకొచ్చారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియో ఫుటేజీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పబ్ ప్రాంగణంలో కోబ్రా, లిజార్డ్‌ వంటి పలు జంతువులు ఉండటం వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పార్టీల పేరిట వన్య ప్రాణులను హింసిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గందరగోళమైన సౌండ్స్, సిగరేట్స్ పొగ, మద్యం సేవిస్తూ.. చిందులు వేసే వాతావరణంలో మూగ జీవులను ప్రదర్శిస్తూ, హింసిస్తున్నారంటూ పలువురు జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Karanataka : బర్త్ డేకి పిలిచింది.. మొఖంపై సలసలకాగే నీరు పోసింది

ఈవెంట్ లో సంబంధించిన ఫొటోలను ఆశిష్‌ చౌదరి అనే యువకుడు సోషల్‌ మీడియా ద్వారా పోస్టు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ట్వీట్‌ చూసిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ స్పందించారు. ఈ విషయాన్ని తెలంగాణ డీజీపీ, సీపీకి అటాచ్ చేస్తూ.. ట్వీట్‌ చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడటం.. సిగ్గుచేటు అంటూ తన ట్వీట్‌ అకౌంట్ లో పేర్కొన్నాడు. దీనిపై జూబ్లిహిల్స్‌ పోలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

Exit mobile version