Site icon NTV Telugu

Jubilee Hills Byelection Results: జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల్లో మంత్రుల పెర్ఫార్మెన్స్ ఇదే..

Cm

Cm

Jubilee Hills Byelection Results: జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే.. ఈ ఎన్నికలకు సంబంధించి మంత్రులకు పలు డివిజన్ బాధ్యలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మంత్రులు మంత్రుల పెర్ఫార్మెన్స్ గురించి చూద్దాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రహమత్ నగర్‌లో పూర్తి మెజార్టీ తెచ్చిపెట్టారు. రహమత్ నగర్ లో పొంగులేటి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకుని గ్రౌండ్ ఖాళీ చేశారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరిలకు వెంగల్‌రావు నగగర్‌ బాధ్యతలు అప్పగించారు. ఇందులోనూ కాంగ్రెస్‌కి అత్యధిక ఓట్లు సాధించాయి. కమ్మ సామాజిక వర్గం ఏకతాటి మీదకు తేవడంలో తుమ్మల కీలక పాత్ర పోషించారు. షేక్‌పేటలో మంత్రులు కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి అంతంత పెర్ఫార్మెన్స్ చూపించారు. మంత్రి దామోదర రాజనర్సింహా ఎర్రగడ్డలో మెజార్టీ చూపారు. యూసఫ్‌గూడలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌, మంత్రి పొన్నం ప్రభాకర్ లీడ్ చేశారు. ఎర్రగడ్డలో మైనార్టీల మత పెద్దలులతో మీటింగులు.. అపార్ట్ మెంట్ వాసుల మీటింగులు కొనసాగాయి.

READ MORE: Gold Price Today: పసిడి ప్రియులకు ఊరట.. హైదరాబాద్‌లో నేటి గోల్డ్ రేట్స్ ఇలా!

Exit mobile version