Ramchander Rao: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పై బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరిగింది.. బీజేపీ అభ్యర్థిపై చర్చించారు. మూడు పేర్లను సెంట్రల్ పార్టీకు పంపించనున్నారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి, రామ చందర్ రావు, అభయ్ పాటిల్, చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్ రావు మాట్లాడారు. జూబ్లీహిల్స్ గెలిచి నరేంద్ర మోడీకి గిఫ్ట్ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసింది.. బీసీలతో రాజకీయాలు చేసిందని విమర్శించారు. మోడీ కుల గణనతో బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. స్థానిక ఎన్నికలకు బీజేపీ రెడీగా ఉందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల లోనూ బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
READ MORE: MP CM Ramesh: ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్తే జగన్‌కు సెల్యూట్ చేస్తా..!
“జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో గెలుస్తాం. ప్రజలు బీజేపీ నీ ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మారుస్తామని విషాద నగరంగా మార్చింది. మ్యాన్ హోల్ లో పడి చనిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం నిర్లక్ష్యం చేస్తోంది. రెండు పార్టీలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. మజ్లిస్ పార్టీ అడిగితే గ్రేవ్ యార్డ్ కు మిలటరీ లాండ్ ఇచ్చారు. కాలని మధ్య స్మశానం తీసుకొస్తున్నారు. గుడులు కూల గొడుతున్నారు. 2,3 రోజుల్లో అభ్యర్థిని డిక్లేర్ చేస్తాం. మజ్లిస్ తో ఈ రెండు పార్టీలకు ఉన్న సంబంధాలు బట్ట బయలు చేయాలి.” అని రామ చందర్‌రావు వ్యాఖ్యానించారు.
READ MORE: Hyderabad: వాలీబాల్ కోచ్ వేధింపులకు విద్యార్థిని బలి..
