NTV Telugu Site icon

Jr Ntr Meets Amit Shah At Novatel: అమిత్ షాతో జూ.ఎన్టీఆర్ కీలక భేటీ

Jr Ntr Shah

Jr Ntr Shah

Exclusive: Jr. NTR Meeting With Amit Shah Ends | Ntv

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా చూసిన అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీ ముగిసింది. అత్యంత ప్రతిభావంతుడైన నటుడు మరియు మన తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది అంటూ హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఇద్దరి మధ్య అరగంట పైగా సమావేశం జరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అమిత్ షా తో కలిసి విందులో పాల్గొనటం రాజకీయంగా ప్రకంపనాలకు కారణమవుతోంది. అటు ఏపీలో పవన్ కళ్యాణ్ తో పొత్తు కొనసాగిస్తున్న బీజేపీ..ఇటు నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ తో ఇప్పుడు నేరుగా అమిత్ షా భేటీ కావటం తెలుగు రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమా చూసిన అమిత్ షా .. జూనియర్ ఎన్టీఆర్ నటన మెచ్చి అమిత్ షా తారక్ తో సమావేశం చర్చనీయాంశంగా మారింది. అమిత్ షా తో భేటీ ద్వారా బీజేపీ..ఇటు తెలంగాణలో.. అటు ఏపీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తారక్ ను తమ పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. అయితే, తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని అమిత్ షాకి తారక్ చెప్పినట్టు తెలుస్తోంది.

భేటీ అనంతరం వివరాలను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మీడియాకు వెల్లడించారు. ‘‘జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రతిభావంతమైన నటుడు, తెలుగు సినిమా తారక రత్నం. ఆర్‌ఆర్‌ఆర్‌ లో ఆయన నటన బాగుంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ ను కలిసి మాట్లాడటం సంతోషకరం..’’ అని అమిత్‌ షా పేర్కొన్నట్టు తెలిపారు.

 

https://youtube.com/watch?v=KOGdVjgf5qc…

Show comments