NTV Telugu Site icon

Jr Ntr : రూటు మార్చేస్తున్న ఎన్టీఆర్.. పాన్ ఇండియా డైరెక్టర్లే కావాలంట

Ntr

Ntr

జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా రూటు మార్చేస్తున్నాడు. ఈ భాష, ఆ భాష అనే తేడాలు లేవంటున్నాడు. పాన్ ఇండియా హిట్లు ఇచ్చే డైరెక్టర్లే కావాలంటున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ వచ్చేసింది. కానీ దాన్ని నిలబెట్టుకోవడమే ఇప్పుడు పెద్ద టాస్క్. అందుకే ఆ ఇమేజ్ ను పెంచే డైరెక్టర్లకే ఓకే చెబుతున్నాడు మన జూనియర్. ఇప్పటికే బాలీవుడ్ లో వార్-2 సినిమాలో నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీకి గతంలో చాలా పెద్ద సినిమాలు తీసిన పేరుంది. అతని డైరెక్షన్ లో బాలీవుడ్ లో పాగా వేయాలన్నది జూనియర్ ప్లాన్.

దాని తర్వాత మాస్ పల్స్ బాగా తెలిసిన పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను లైన్ లో పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. దీనికి డ్రాగన్ అనే పేరును దాదాపు ఖాయం చేశారు. ఈ మూవీతో ఎన్టీఆర్ ఇమేజ్ పెరుగుతుందని భావిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ కాకముందే మరో పాన్ ఇండియా డైరెక్టర్ ను కూడా లైన్ లో పెట్టేశాడు. జైలర్ సినిమాతో భారీ హిట్ కొట్టిన తమిళ డైరెక్టర్ నెల్సన్ తో ఓ సినిమా కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతం జైలర్-2 సినిమాతో నెల్సన్ చాలా బిజీగా ఉన్నాడు. దీని తర్వాత ఎన్టీఆర్ తో సినిమా ఉండబోతోంది.

ఇప్పటి వరకు తెలుగు డైరెక్టర్లతోనే సినిమాలు చేసిన ఎన్టీఆర్.. ఇప్పుడు వరుసగా ఇతర భాషల డైరెక్టర్లనే లైన్ లో పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కానీ ఎన్టీఆర్ మాత్రం పాన్ ఇండియా హిట్ డైరెక్టర్లే కావాలంటున్నాడు. భాషతో సంబంధం లేదు.. హిట్ ఇచ్చే డైరెక్టర్ కే ఓకే అంటున్నాడు. ఎందుకంటే ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ను పెంచుకునే పనిలో ఉన్నాడు. అందులో భాగంగానే ఇలా డైరెక్టర్లను ఏరికోరి ఎంచుకుంటున్నట్టు సమాచారం.