NTV Telugu Site icon

Jr.NTR: ఇట్స్ అఫీషియల్.. ఆ ఓటీటీలో దేవర స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

Devara 17

Devara 17

Jr.NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. రిలీజ్ అయిన ప్రతీ చోట మొదట నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నా కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టింది. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా దసరా కానుకగా రిలీజ్ కాబడిన సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవర విజయంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

Read Also:Dead Body In Suitcase: శవాన్ని సూట్ కేసులో ఉంచి రైలు ప్లాట్‌ఫాంపై విసిరేసిన తండ్రీకూతురు

ఇదిలా ఉండగా దేవర డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు వస్తుందా అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. దేవర డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. సో దేవర ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తే నెట్ ఫ్లిక్స్ లోనే వస్తుంది. కాగా దేవర డిజిటల్ రైట్స్ అమ్మకాలు చేసినప్పుడ థియేటర్స్ లో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీ రిలీజ్ చేసేలా డీల్ చేసారు మేకర్స్. ఈ నేపథ్యంలో దేవర గత నెల 27న రిలీజ్ అయింది. ఆ లెక్కన ఎనిమిది వారాలు అంటే నవంబర్ రెండో వారం ఓటీటీలో రిలీజ్ అవ్వాల్సి ఉంది. దీంతో దేవర మేకర్స్ సమాచారం ప్రకారం నవంబరు 8న దేవర డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అవనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారక ప్రకటన రానుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక్క నెట్ ఫ్లిక్స్ తప్పా మిగతా అందరూ నెట్ ఫ్లిక్స్ లోగో పెట్టి దేవర ఎనిమిదిన వచ్చేస్తున్నాడు అంటూ పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన వస్తే గానీ దేవర 8నుంచి వస్తుందా రాదా అనేది తెలుస్తుంది.

Read Also:CM Chandrababu: వరుస సమీక్షలతో సీఎం బిజీ.. నేడు డ్రోన్, ఐటీ, సెమికండక్టర్ పాలసీ, పోలవరంపై రివ్యూ..