NTV Telugu Site icon

NTR : బాలేదనేయడం ఫ్యాషన్ అయిపోయింది.. ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ntr Nelson

Ntr Nelson

NTR : ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా రన్ అవుతోంది. రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పుడు దసరా సెలవులు దేవరకు అతిపెద్ద ప్రయోజనంగా మారాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ దేవర, వరా పాత్రల్లో ద్విపాత్రాభినయం చేయడంతో మంచి ప్రశంసలు వస్తున్నాయి. కాగా, ఈ చిత్రానికి సంబంధించి బ్లాక్ బస్టర్ జర్నీ ఆఫ్ దేవరా అనే ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఎన్టీఆర్, కొరటాల శివ తమ సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో అభిమానులను కలవలేకపోయినందుకు చాలా బాధగా ఉందని ఎన్టీఆర్ అన్నారు.

Read Also:Jr.NTR : దేవర బయ్యర్స్ కు ఇక లాభాలే లాభాలు..

భారీ అంచనాల మధ్య విడుదల అయిన ‘దేవర’ సినిమా మొత్తానికి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మిక్స్ డ్ టాక్ వచ్చినా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మాత్రం భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఐతే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు ఆడియన్స్ లో కొందరు సినిమాని చూసే ముందే చాలా క్యాలిక్యులేషన్స్ పెట్టుకొని థియేటర్ కి వెళ్తున్నారు. బేసిక్ గా నేనే కాదు, చాలామంది ఫస్ట్ అసలు ఏమీ తెలుసుకోకుండానే సినిమా బాలేదట అనడం బాగా అలవాటు అయిపోయింది. చాలా నెగిటివ్ అయిపోయాం. అలా కాకుండా ఓపెన్ గా ఒక సినిమాని సినిమాలా చూస్తేనే ఆ సినిమాను కరెక్ట్ గా ఎంజాయ్ చేయగలం’ అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. కాగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందించారు.

Read Also:Iran Israel War: మసీదుపై ఇజ్రాయెల్ ఆర్మీ వైమానిక దాడి.. 18 మంది మృతి