Site icon NTV Telugu

Joker 2 Movie : నవ్వించడానికి మళ్లీ ‘జోకర్ ‘ వచ్చేస్తున్నాడు…

Joker

Joker

హాలివుడ్ సినిమాలు భారీ యాక్షన్ తో వస్తుంటాయి.. ఆ సినిమాలు తెలుగులో కూడా మంచి క్రేజ్ ను అందుకుంటున్నాయి.. అంతేకాదు జోకర్ లాంటి సినిమాలు కూడా ఉన్నాయి.. హాలీవుడ్‌ మ్యూజికల్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ‘జోకర్‌’. జోక్విన్‌ ఫీనిక్స్‌ ప్రధాన పాత్రలో టాడ్‌ ఫిలిప్స్‌ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా 2019లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది.. ఇప్పటికి ఆ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు.. ఎప్పుడూ వచ్చిన చూస్తున్నారు.. ఇక ఈ సినిమాకు ఇన్నాళ్లకు సీక్వెల్ గా మరోసారి నవ్వించడానికి వచ్చేస్తున్నాడు జోకర్..

ఈ’ సినిమాకు సీక్వెల్‌గా ‘జోకర్‌ 2’ ను ప్రకటించారు టాడ్‌ ఫిలిప్స్‌. ఈ చిత్రంలో జోక్విన్‌ ఫీనిక్స్‌తో పాటు లేడీ గగా మరో లీడ్‌ రోల్‌ చేస్తున్నారు.. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అందరూ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కాబోతుందని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది..

జోకర్ సినిమాలో జాజై బీట్జ్‌ మరో లీడ్‌ రోల్‌లో కనిపిస్తారు. లాస్‌ ఏంజిల్స్, న్యూయార్క్, న్యూ జెర్సీ లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిపారు. ఈ చిత్రం ట్రైలర్‌ ఏప్రిల్‌ 4న విడుదల కానుం దని హాలీవుడ్‌ టాక్‌. సినిమాను ఈ ఏడాది అక్టోబరు 4న విడుదల చేయాలనుకుంటున్నారు. టాడ్‌ ఫిలిప్స్, బ్రాడ్లీ కూపర్‌ నిర్మిస్తున్న ఈ జోకర్ 2 సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యనున్నారు.. ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి..

Exit mobile version