ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై నమోదైన లైంగిక వేధింపుల కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో బాధితురాలు (మైనర్ బాలిక) టీఎఫ్‌టీడీడీఏ (TFTDDA) ప్రెసిడెంట్ వి.వి. సుమలతా దేవి పై తీవ్ర ఆరోపణలు చేసింది. తనను వేధించిన జానీ మాస్టర్‌ను రక్షించేందుకు సుమలత ప్రయత్నిస్తున్నారని, తన పరువు తీసేలా ప్రవర్తిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పోక్సో (POCSO) చట్టం కింద నిందితుడిగా ఉన్న వ్యక్తిని కాపాడటానికి ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తి ఇలా చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించింది.
Also Read : Pushpa 3 : పుష్ప 3కి బ్రేక్..?సుకుమార్ ప్లాన్ బయటపెట్టిన నిర్మాత
ఈ సందర్భంగా బాధితురాలు తన భద్రతపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది. “నేను నా పని ప్రదేశంలో సురక్షితంగా ఉన్నానా? ఒక నేరస్థుడిని కాపాడేందుకు నాపై ఇలాంటి ఆరోపణలు చేయడం అవసరమా?” అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది. దీనికి సంబంధించిన వీడియోలు మరియు స్క్రీన్ షాట్‌లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. జానీ మాస్టర్ ఈ కేసులో ఇప్పటికే అరెస్టయి బెయిల్‌పై బయట ఉండగా, బాధితురాలు చేస్తున్న ఈ తాజా వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో మరోసారి చర్చకు దారితీశాయి. ఈ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
