NTV Telugu Site icon

Jogi Ramesh: సంబరాలకు సిద్ధం కండి.. గెలిచేది మనమే..

Jogi Ramesh

Jogi Ramesh

Jogi Ramesh: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నారు జోగి రమేష్.. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణాల పేదలు.. ఒక్కతాటిపైకి వచ్చే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటువేశారని తెలిపారు.. అయితే, ఓటమి భయంతోనే టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి నేతలు మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని విమర్శించారు. మరోసారి అధికారంలోకి రాబోతున్నాం.. వైసీపీ శ్రేణులు విజయోత్సవ సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడని దుయ్యబట్టారు.. కూటమి గెలుస్తుందంటూ మావాళ్లను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారన్న ఆయన.. జూన్ 4వ తేదీన వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు..

Read Also: Sandeep Lamichhane: రేప్ కేసులో నేపాల్ క్రికెటర్కు ఊరట.. నిర్దోషిగా తేల్చిన హైకోర్టు

ఇక, పవన్ కల్యాణ్‌, చంద్రబాబు, పురంధేశ్వరి మాపై దాడులకు పురికొల్పుతున్నారని మండిపడ్డారు.. మరోవైపు.. ఈసారి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌, నందమూరి బాలకృష్ణ కూడా ఓడిపోతున్నారని జోస్యం చెప్పారు జోగి రమేష్‌.. కాగా, రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మండిపడుతున్నారు.. ఇక, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసిన వైసీపీ నేతలు.. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఫిర్యాదు చేశారు.. ఏపీ సీఈవోను కలిసిన వైసీపీ నేతల బృందంలో అంబటి రాంబాబు, జోగి రమేష్, మేరుగ నాగార్జున, పేర్ని నాని, అప్పిరెడ్డి తదితరులున్నారు..