Site icon NTV Telugu

Joe Root-Sachin: దిగ్గజాలను మించేలా జో రూట్.. అప్పుడే సచిన్‌కు దగ్గరగా వచ్చేశాడు!

Joe Root

Joe Root

క్రికెట్‌లో ఎప్పుడూ రికార్డులు క్రియేట్ అవుతూనే ఉంటాయి. అలాగే ఉన్న రికార్డులు బద్దలవుతూనే ఉంటాయి. అయితే టెస్ట్ క్రికెట్‌లో మాత్రం కాస్త భిన్నం. ఇక్కడ రికార్డులు బద్దలుకొట్టాలనుంటే.. అతను ‘ది బెస్ట్ ప్లేయర్’ అయ్యుండాలి. అలాంటి ప్లేయరే జో రూట్. అంతేకాదు ఇప్పడు టెస్ట్ క్రికెట్లో ఉన్న గోట్ ప్లేయర్ కూడా. టెస్టుల్లో విరాట్ కోహ్లీ రిటైర్ కావడంతో ప్రస్తుతం ఫ్యాబ్ ఫోర్‌లో రూట్, స్టీవ్ స్మిత్ , కేన్ విలియమ్‌సన్ మాత్రమే ఉన్నారు. రూట్ ఆడిన ప్రతి మ్యాచులో ఏదో ఒక రికార్డు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ రికార్డును బ్రేక్‌ చేసేందుకు చూస్తున్నాడు.

ప్రస్తుతం లార్డ్స్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ అత్యధిక హాఫ్‌ సెంచరీలు సాధించిన ప్లేయర్ల లిస్ట్‌లో అగ్రస్థానంలో వున్న సచిన్‌కు దగ్గరగా వచ్చేశాడు. రూట్ 284వ టెస్ట్‌ ఇన్నింగ్స్‌లో 67వ హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. దీంతో వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ శివనారాయణ్‌ చంద్రపాల్‌ను అధిగమించాడు. అయితే ఈ లిస్ట్‌లో సచిన్‌ 200 టెస్టుల్లో 68 హాఫ్‌ సెంచరీలతో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్నాడు. రూట్‌ 156 టెస్టుల్లోనే 67 హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసి రెండవ స్థానంలో నిలిచాడు.

Also Read: Wimbledon 2025 Final: అల్కరాజ్, సినర్‌ సూపర్.. నెల రోజుల్లోనే ఇద్దరికీ రెండవ ఫైనల్!

టీమిండియాపై జో రూట్ తన ప్రదర్శనని కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పటికే టెస్టుల్లో 67 అర్ధ శతకాలు చేసిన ఈ ప్లేయర్.. ఒక్క టీమిండియా మీదే 13 అర్ధ శతకాలు చేశాడు. దీంతో పాక్ లెజెండ్ జావెద్‌ మియాందాద్‌ తర్వాతి స్థానంలో నిలిచాడు. కాగా ఇండియాపై జావెద్‌ మియాందాద్‌ 14 హాఫ్‌ సెంచరీలు చేశారు. ఇప్పుడు అతడి తర్వాతి స్థానంలో జో రూట్ ఉన్నాడు. ఇదిలా ఉండగా లార్డ్స్‌ ఇన్నింగ్స్‌తో టెస్టుల్లో భారత్‌పై 3,000 పరుగులు కూడా రూట్ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ రికార్డు అందుకున్న మొదటి ఆటగాడిగానూ రూట్ నిలిచాడు.

Exit mobile version