NTV Telugu Site icon

Joe Biden: నేను పోటీలో ఉంటే ట్రంప్‌ ఓడిపోయాడు: బైెడెన్‌

Joe Biden

Joe Biden

Joe Biden: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ చేతిలో కమలా హారిస్‌ ఓటమిపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్, డెమోక్రటిక్‌ పార్టీతో ఐక్యత కోసం పోటీలో పాల్గొనకపోవడం వల్ల తాను ట్రంప్‌ను ఓడించడంలో విఫలమైనట్లు తెలియజేశారు. ఒకవేళ నేను పోటీలో నేను ఉంటే ట్రంప్‌ను కచ్చితంగా ఓడించేవాడిని అని జో బైడెన్ నమ్మకంగా పేర్కొన్నారు. అధికారంలో తిరిగి పోటీ చేయకూడదనే నిర్ణయంపై నాకు విచారం లేదు. నేను, కమలా హారిస్‌ డెమోక్రటిక్‌ పార్టీకి కలిసి పని చేయాలనుకున్నాము. కమల హారిస్‌ విజయవంతమవుతుందని నాకు నమ్మకం ఉంది. నలుగురు సంవత్సరాల తర్వాత ఆమె మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తుందని, ట్రంప్‌ తిరిగి అధ్యక్షుడు కావడాన్ని అడ్డుకోవడం కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

Also Read: Los Angeles Fire: ఓవైపు కార్చిచ్చు.. మరోవైపు మంచుతో ఇక్కట్లు

ఒకవేళ నేను అమెరికా అధ్యక్షుడుగా ఉండకపోయినా.. ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన పదవీ విరమణ తర్వాత ప్రజా జీవితంలో కొనసాగుతానని స్పష్టం చేశారు. 20వ తేదీన అధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్న ఆయన, తన తదుపరి కార్యక్రమాలను తెలియజేయలేదు. నేను తప్పు చేయలేదని భావిస్తున్నాను, క్షమించాల్సిన అవసరం నాకు లేదని బైడెన్ తెలిపారు. జో బైడెన్‌ ఈ నెల 15వ తేదీన తన వీడ్కోలు ప్రసంగం చేయనున్నారు. ఆ రోజు రాత్రి 8 గంటలకు తన కార్యాలయం నుండి అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగం నిర్వహిస్తారు. 20వ తేదీన ఆయన అధికారికంగా అధ్యక్ష పదవిని వదిలి ట్రంప్‌కు బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ ప్రకటనలు జో బైడెన్‌ తన కార్యకాలం ముగిసిన తరువాత కూడా ప్రజా జీవితంలో కొనసాగడానికి, మరింతగా ప్రజల సేవలో ఉంటూనే, అమెరికా రాజకీయాలపై తన ప్రభావాన్ని కొనసాగించవచ్చని భావించవచ్చు.

Show comments