శాన్‌ఫ్రాన్సిస్కోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సమావేశం అయ్యారు. అయితే, ఆరేళ్ల తర్వాత జీ జిన్‌పింగ్ అమెరికాకు వెళ్లారు. ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (APEC) నేతల సమావేశంలో కూడా జీ జిన్‌పింగ్ పాల్గొన్నారు. ఇరు దేశాలు కూడా తమ సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి, అక్రమ ఫెంటానిల్‌ను పరిష్కరించడానికి అంగీకరించాయి. అదే సమయంలో, సైనిక కమ్యూనికేషన్లను తిరిగి స్థాపించడానికి అమెరికా- చైనా అంగీకరించింది.
Read Also: Virat Kohli-Anushka Sharma: అనుష్క ఏం చేస్తుందబ్బా.. స్టేడియంలో విరాట్ కోహ్లీ వెతుకులాట!
ఇక, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, తైవాన్, చైనా గూఢచారి బెలూన్లు సహా పలు అంశాలపై జిన్ పింగ్- జో బైడెన్ మధ్య చర్చ జరిగింది. అయితే, షీ జిన్‌పింగ్ చైనాను ‘నియంత’గా నడుపుతున్నారని అమెరికా ఎప్పటినుంచో ఆరోపిస్తుంది. (జి జిన్‌పింగ్‌ను నియంత అని జో బిడెన్ పిలుస్తారు). చైనా నియంత పోకడలపై అమెరికా ఇప్పటికి అలాంటి కామెంట్స్ చేస్తునే ఉంది. ఇక, చైనా అధ్యక్షుడిని కలిసిన తర్వాత జో బిడెన్ మాట్లాడుతూ.. జిన్‌పింగ్ నియంతలా వ్యవహరిస్తున్నారని తాను ఇప్పటికీ భావిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Bandi Sanjay: పొరపాటున కేసీఆర్ గెలిస్తే ఆర్టీసీ ఆస్తులు మిగలవు
ఇక, జో బైడెన్ విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తున్నప్పుడు.. జి జిన్‌పింగ్‌ను ఇప్పటికీ నియంతగా భావిస్తున్నారా అని ఒక విలేఖరి అడిగాడు. దానికి సమాధానంగా, అతను ఒక కమ్యూనిస్టు దేశాన్ని.. అమెరికా ప్రభుత్వం కంటే పూర్తి భిన్నమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని నడిపిస్తున్న వ్యక్తి అని అన్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడు కామెంట్స్ పై జీ జిన్‌పింగ్ మాట్లాడుతూ.. రెండు దేశాల విజయానికి ఎంతో కృషి చేస్తాయని తెలిపారు. బైడెన్ మాటలలో ఎలాంటి అపార్థం లేదు.. ఒకరినొకరు స్పష్టంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను అని జిన్ పింగ్ తెలిపారు.