Jodhpur Cafe Controversy: భారతదేశంలో ఉంటూ.. దేశంలో వ్యాపారం చేసుకుంటూ భారతీయులకు తన కేఫ్‌లోకి ప్రవేశం లేదన్నాడు ఒక యజమాని. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలువురు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ వెలుగుచూసింది అంటే.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ పరిధిలోని ఒక కేఫ్‌లో చోటుచేసుకుంది. ప్రస్తతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
READ ALSO: CM Chandrababu: ఐటీ గురించి కాదు.. రైతుల కోసమే ఎక్కువగా ఆలోచిస్తా!
అసలు ఏం జరిగిందంటే..
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని ‘డైలాన్స్ కేఫ్’కి ఐఐటి విద్యార్థుల స్నేహితుల బృందం వెళ్లింది. అయితే వారికి కేఫ్ లోకి ప్రవేశం లేదని చెప్పారు. దీంతో వారు కేఫ్ యజమానితో ఫోన్‌లో మాట్లాడారు. ఆ యజమాని ఫోన్‌లో ఆ స్నేహితుల బృందంతో మాట్లాడుతూ.. భారతీయులకు తన కేఫ్‌లోకి ప్రవేశం నిరాకరించినట్లు తెలిపారు. విదేశీయులకు మాత్రమే తన కేఫ్‌లోకి అనుమతి ఉందని చెప్పాడు. ఆయన మాటలు విన్న విద్యార్థులు భారతీయులకు ఎందుకని కేఫ్‌లోకి ప్రవేశం లేదో చెప్పాలని ప్రశ్నిస్తే.. యజమాని తన మాటలు దాటేశాడు. ఈ కేఫ్ యజమాని పేరు ‘భాఖర్ ఖాన్’ అని సమాచారం. ఈ సంభాషణ అంతా కూడా ఒక వీడియోలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ వీడియోపై కేఫ్ యజమాని స్పందించలేదు.
ఈ వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఇలా చేయడం తప్పు అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. పలువురు దీనిని కేవలం ప్రచార స్టంట్ అని కొట్టిపాడేస్తున్నారు. మరికొందరు ఏమో.. భారతదేశంలో నిర్వహిస్తున్న కేఫ్‌లోకి భారతీయులకు ప్రవేశం లేని బ్రిటిష్ యుగానికి మనం మళ్ళీ వెళ్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు.
READ ALSO: China K Visa: అమెరికా తలబిరుసు తనం.. చైనా సరికొత్త ఆహ్వానం..
