ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECGC) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు హిందీ లేదా ఇంగ్లీషులో మాస్టర్స్ డిగ్రీ, ఇతర నిర్దేశించిన అర్హతలను కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు.
Also Read:Shocking Video: అడవిలో ఫోటోలు దిగుతున్న యువకుడు.. పొదల్లోకి లాక్కెళ్లిన పులి
SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు, వికలాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు డిసెంబర్ 02 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 06, 07 మధ్య ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
