NTV Telugu Site icon

Unforgettable rejection: జాబ్‌ కోసం దరఖాస్తు చేసుకుంది.. ఊహించని గిఫ్ట్‌ అందుకుంది..! కానీ..

Rejection Letter

Rejection Letter

Unforgettable rejection: ఏదైనా జాబ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారంటే.. ఏమవుతుందో అనే టెన్షన్‌ ఆ అభ్యర్థిలో ఉంటుంది. ఆ సంస్థ ఎలా స్పందిస్తుంది? ఉద్యోగం ఇస్తుందా? తిరస్కరిస్తుందా? అనే ఉత్కంఠ ఉంటుంది.. అయితే, సిలికాన్ వ్యాలీలోని ఓ కంపెనీలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ఓ మహిళలకు సదరు సంస్థ ఊహించని గిఫ్ట్‌ పంపి ఆశ్చర్యపరిచింది.. ఊహించని గిఫ్ట్‌ ఏంటి? ఉద్యోగ సమాచారం కదా? ఇవ్వాల్సింది అనే ప్రశ్న తలెత్తవచ్చు.. విషయం ఏటంటే.. ఉద్యోగం ఇవ్వకుండా ఓదార్పుగా ఆ బహుమతి పంపింది.. మీకు ఈ ఉద్యోగం ఇవ్వలేకపోతున్నామనే సందేశాన్ని ఇస్తూనే.. ఓ గిఫ్ట్‌ పంపడంతో.. ఈ వ్యవహారం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిలికాన్ వ్యాలీలోని డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ‘సీక్రెట్ సుషీ’ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది ఓ మహిళ.. అయితే సర్వసాధారణంగా ఉద్యోగం కోసం అప్లికేషన్‌ పెట్టుకున్న సమయంలో.. ఆ ఉద్యోగం ఇవ్వని పక్షంలో.. సారీ మిమ్మల్ని సెలక్ట్ చేయడం లేదని మెయిల్ పెడుతుంటారు.. ఇంకా కొన్ని కంపెనీలు అయితే.. ఎలాంటి సమాచారం కూడా ఇవ్వవు.. కానీ, సీక్రెట్ సుషీ మాత్రం.. మేనేజర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యర్థికి తిరస్కరణ లేఖతో పాటు అమెజాన్ గిఫ్ట్ కార్డును పంపించి ఆశ్చర్య పరిచింది.. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న సదరు అభ్యర్థికి సీక్రెట్ సుషీ నుండి దరఖాస్తు చేసినందుకు ధన్యవాదాలు అని చెబుతూ.. మిమ్మల్ని సెలక్ట్ చేయడంలేదని స్పష్టం చేసింది.. దాంతో పాటు గిఫ్ట్ వోచర్‌ను కూడా పంపించింది. ఇందుకు సంబంధించి ఆమె మెయిల్ స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేవారు.. తనకు వచ్చిన 7 డాలర్ల గిఫ్ట్ వోచర్‌ను కూడా పొందుపరిచి, మరిచిపోలేని అత్యుత్తమ తిరస్కరణ అంటూ కామెంట్‌ పెట్టారు.. ఇది కాస్తా ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

ఇక, జాబ్ రిజెక్షన్ లెటర్‌లో అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌ని చేర్చినందుకు సిలికాన్ వ్యాలీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ప్రశంసలు అందుకుంటుంది.. ఉద్యోగం రాకపోవడంతో నిరాశకు గురైనప్పటికీ, దరఖాస్తుదారురాలు ఈ ఊహించని గిఫ్ట్‌తో ఓదార్పుని పొందారు. Reddit పోస్ట్‌లో దీనిని “బెస్ట్ రిజెక్షన్” అని పేర్కొన్నారు. “సీక్రెట్ సుషీలో ఖాతా మేనేజర్/ప్రాజెక్ట్ మేనేజర్” హోదాలో ఆమె ఆసక్తికి కృతజ్ఞతలు తెలుపుతూ మరియు ఆమె అర్హతలు మరియు అనుభవంతో కంపెనీ నిజంగా ఆకట్టుకుందని పేర్కొంటూ ఈమెయిల్ ప్రారంభమైంది. ఈ ఇమెయిల్ దరఖాస్తుదారుకు భరోసా ఇచ్చింది. భవిష్యత్ స్థానాల కోసం ఆమె సమాచారాన్ని కలిగి ఉంటారని పేర్కొంటూ.. “మీరు ఒకరినొకరు తెలుసుకోవడంలో పెట్టుబడి పెట్టిన సమయాన్ని మరియు కృషిని మేం నిజంగా అభినందిస్తున్నాము మరియు భవిష్యత్తులో మీ మార్గాలు మళ్లీ దాటాలని ఆశిస్తున్నాము. .” అని పేర్కొంది.