Jio – BSNL: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (RJIL) తన అర్హులైన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కొత్త ఇంట్రా-సర్కిల్ రోమింగ్ (ICR) ప్యాక్‌లను తీసుకవచ్చింది. ఈ ప్యాక్‌ల ద్వారా వినియోగదారులు ఎంపిక చేసిన ప్రాంతాలలో BSNL నెట్‌వర్క్‌ను ఉపయోగించుకునే అవకాశం పొందుతున్నారు. ఈ సేవ ఒకే టెలికాం సర్కిల్‌లో వాయిస్ కాల్స్, డేటా, SMS వినియోగానికి మద్దతు ఇస్తుంది, దీనితో నెట్‌వర్క్ కవరేజ్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా వినియోగదారులు కనెక్ట్ అవ్వగలరు.
Jubilee Hills Bypoll: 139 డ్రోన్స్ నిఘాలో పోలింగ్ కేంద్రాలు.. ప్రైవేటు డ్రోన్స్‌కు నో పర్మిషన్..!
ఇక ఈ జియో ICR సేవను ఉపయోగించాలంటే అందుకు సంబంధించిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌ను యాక్టివేట్ చేయాలి. రీఛార్జ్ చేసిన తర్వాత ప్లాన్ “queued state”లో ఉంటుంది. కస్టమర్ BSNL నెట్‌వర్క్‌లో మొదటిసారి కాల్ చేయడం, SMS పంపడం లేదా మొబైల్ డేటా వినియోగించడం వంటి చర్యను చేసిన వెంటనే ఈ ప్లాన్ నేరుగా యాక్టివేట్ అవుతుంది. యాక్టివేషన్ అయిన తర్వాత ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో అమలులో ఉంటుంది. ఈ ICR సదుపాయం కేవలం BSNL ICR నెట్‌వర్క్‌కే పరిమితం అవుతుంది. జియో నెట్‌వర్క్‌లో చేసే వినియోగం ఈ ప్లాన్ పరిధిలోకి రాదు. అలాగే ఎయిర్టెల్, Vi (Vodafone Idea) వంటి ఇతర ఆపరేటర్ల నెట్‌వర్క్‌లపై ఉపయోగించుకోలేరు. యాక్టివ్ ICR ప్యాక్ ఉన్న వినియోగదారులకే BSNL నెట్‌వర్క్ కనెక్టివిటీ లభిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో కస్టమర్ ఇప్పటికే ఉన్న ప్లాన్ బ్యాలెన్స్ నుంచి తాత్కాలిక ICR వినియోగం ప్రారంభించబడవచ్చు.
ప్రస్తుతం ఈ BSNL ICR సేవలు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సర్కిల్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంతంలోని మద్దతు ఉన్న ప్రదేశాలలో జియో వినియోగదారులు ఈ సదుపాయాన్ని పొందగలరు. జియో ప్రస్తుతం రూ.196, రూ.396 అనే రెండు ICR ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌లను అందిస్తోంది. ఇక రూ.196 ప్లాన్‌లో వినియోగదారులు 1000 ICR వాయిస్ నిమిషాలు, 2GB డేటా, 1000 SMSలు 28 రోజుల వ్యాలిడిటీతో పొందుతారు. అలాగే రూ.396 ప్లాన్‌లో 1000 వాయిస్ నిమిషాలు, 10GB డేటా, 1000 SMSలు 28 రోజుల వ్యాలిడిటీతో అందించబడతాయి. ఈ రెండు ప్యాక్‌లు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సర్కిల్ లోని జియో ప్రీపెయిడ్ కస్టమర్‌లకు జియో వెబ్‌సైట్, మైజియో యాప్, అలాగే రీఛార్జ్ అవుట్‌లెట్‌ల ద్వారా అందుబాటులో ఉన్నాయి.
