Site icon NTV Telugu

Jiiva : వైఎస్ జగన్ పాత్రలో నటించడం చాలా రిస్క్.. కానీ

Whatsapp Image 2024 01 18 At 4.39.35 Pm

Whatsapp Image 2024 01 18 At 4.39.35 Pm

ప్రజా నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన యాత్ర చిత్రం 2019లో విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.2019 సార్వత్రిక ఎన్నికల ముందు యాత్ర రిలీజ్ కావడంతో ఆ చిత్రం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడానికి ఎంతగానో ఉపయోగపడింది.యాత్ర సినిమాను దర్శకుడు మహి వి రాఘవ తెరకెక్కించారు. వైఎస్ఆర్ పాత్రలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి అద్భుతంగా నటించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా యాత్ర 2 చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. యాత్ర 2లో వైఎస్ఆర్ మరణం.. వైఎస్ జగన్ ఏపీ రాజకీయాల్లో ఎదిగిన విధానం హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే జగన్ చేసిన పాద యాత్రని ఎంతో ఎమోషనల్ గా మహి వి రాఘవ్ చూపించబోతున్నారు.యాత్ర 2 చిత్రం ఎన్నికల హీట్ మరింత పెంచేలా ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రమోషన్స్ మొదలయ్యాయి.

ఈ చిత్రంలో వైఎస్ జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన యాత్ర 2టీజర్ లో జీవా జగన్ పాత్రలో ఒదిగిపోయారనే చెప్పాలి.తాజాగా ఓ ఇంటర్వ్యూలో జీవా యాత్ర 2 పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాత్ర 2 చిత్రానికి అంగీకారం తెలిపేందుకు చాలా ఆలోచించానని ఆయన చెప్పుకొచ్చారు.. ‘నాకు జగనన్న జర్నీ చాలా ఇష్టం. కానీ యాత్ర 2 ఆఫర్ వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకున్నా. జగన్ ప్రభావవంతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి పాత్రలో నటించడం చాలా రిస్క్. ఆ పాత్రకి నేను న్యాయం చేకుంటే నా కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది అని జీవా తెలిపాడు.కానీ టీజర్ రిలీజ్ అయ్యాక జగన్ పాత్రలో జీవా ఒదిగిపోయాడు అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. జగన్ బాడీ లాంగ్వేజ్ ని డైలాగ్ డెలివరీని జీవా పర్ఫెక్ట్ గా చేసారు.. యాత్ర 2 చాలా వరకు కల్పితంగా ఉంటుంది అని డైరెక్టర్ మహి వి రాఘవ్ ప్రకటించిన విషయం తెలిసిందే.జగన్ పాదయాత్ర గురించి 2019లో ముఖ్యమంత్రిగా ఎదిగిన విధానం గురించి మహి వి రాఘవ్ ఈ చిత్రంలో చూపించబోతున్నారు. అదే విధంగా జగన్ జైలుకు ఎలా వెళ్లారు అనే అంశాన్ని కూడా మహి వి రాఘవ్ ఈ చిత్రంలో చూపించారు.

Exit mobile version