Site icon NTV Telugu

Jigris Movie Teaser: “జిగ్రీస్” టీజర్ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్.. ముఖ్య అతిథిగా సందీప్‌రెడ్డి వంగా..

Jigris

Jigris

Jigris Movie Teaser: నలుగురు ఫ్రెండ్స్ వారి మధ్య చిన్న చిన్న గొడవలు సరదా పంచ్‌లు.. ఇలాంటి కథాంశాలతో వచ్చే సినిమాలు ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఎప్పుడు ఉంటారు. దర్శకులు చేయాల్సిదల్లా రైటింగ్‌లో మ్యాజిక్ చూపించడమే. అలంటి నేపథ్యంలోనే మరొక దోస్త్ గ్యాంగ్ రాబోతుంది. కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో మౌంట్ మెరు పిక్చర్స్ ఓ యూత్‌ఫుల్ క్రేజీ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తోంది. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ వోడపల్లి నిర్మాత. ఈ చిత్రానికి “జిగ్రీస్” అనే క్రేజీ టైటిల్ ఖరారు చేశారు. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సెన్సేషనల్ చిత్రాల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా జిగ్రీస్ టైటిల్, ఫస్ట్ లుక్‌ని లాంచ్ చేసి టీంకి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.

READ MORE: Dhanush Found His Real-Life Seeta?: హీరో ధనుష్‌కు రియల్ లైఫ్ సీత దొరికేసిందోచ్…?

తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ కార్యక్రమానికి సైతం సందీప్‌రెడ్డి వంగా అతిథిగా హాజరుకానున్నారు. ఈ నెల 8న రాత్రి 8 గంటలకు ఎల్‌బీనగర్‌లోని అర్బన్ మాయా బజార్‌లో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు. సందీప్‌రెడ్డి చేతుల మీదుగా టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌ యూత్‌కు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఓ వింటేజ్ మారుతి 800 కారు పక్కన నిలబడ్డ నలుగురు ఫ్రెండ్స్‌ని పై నుంచి చూపించడం ఆకట్టుకుంది. చిన్ననాటి స్నేహితులు, నోస్టాల్జియా, క్రేజీ అడ్వెంచర్స్, హిలేరియస్ రోడ్ ట్రిప్ నేపథ్యంలో యూత్‌ఫుల్‌ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కిస్తున్నామని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి స్టోరీలకు యూత్‌లో మంచి క్రేజ్‌ ఉంది. ఈ టీజర్‌ యువతను ఆకట్టుకునే అవకాశం ఉంది.

Exit mobile version