Site icon NTV Telugu

Syed Mushtaq Ali Trophy 2025: చరిత్ర సృష్టించిన ఝార్ఖండ్.. ఓటమితో ఎస్‌ఎంఏటీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీం

Syed Mushtaq Ali Trophy

Syed Mushtaq Ali Trophy

Syed Mushtaq Ali Trophy 2025: సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025 సూపర్ లీగ్ గ్రూప్ ఏ లో థ్రిల్లర్ మ్యాచ్ కనువిందు చేసింది. ఆంధ్రప్రదేశ్- ఝార్ఖండ్ మధ్య జరిగిన సూపర్ మ్యాచ్ మామూలుగా లేదు. ఈ మ్యాచ్‌లో ఝార్ఖండ్ 9 రన్స్ తేడాతో ఓడిపోయింది. అయినా కూడా ఝార్ఖండ్ నయా చరిత్ర సృష్టిస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఝార్ఖండ్ టీం కెప్టెన్ ఇషాన్ కిషన్ నాయకత్వంలో ఈ జట్టు మొదటిసారి ఎస్‌ఎంఏటీ ఫైనల్‌కు చేరుకుంది. డిసెంబర్ 18న పుణెలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో ఝార్ఖండ్ ప్రత్యర్థి ఎవరో త్వరలోనే రివీల్ కానుంది.

READ ALSO: Tejasvi Singh-IPL 2026: కేకేఆర్‌కు కొత్త యువ వికెట్‌ కీపర్.. ఎవరీ తేజస్వి సింగ్‌!

ఆంధ్ర బౌలర్ల ధాటికి ఝార్ఖండ్ 194/8కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో నితీష్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర 203/7 స్కోరు నమోదు చేసింది. తర్వాత ఛేజింగ్‌‌కు దిగిన ఝార్ఖండ్ తరుఫున ఇషాన్ కిషన్ – విరాట్ సింగ్ 88 రన్స్ భాగస్వామ్యంతో పోరాడారు. కానీ చివరి ఓవర్లలో వికెట్లు కోల్పోయి 9 రన్స్ తేడాతో ఝార్ఖండ్ ఓటమి పాలైంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ వెలుగు చూసింది. నిజానికి ఫైనల్ బెర్త్ చేరుకోడానికి ఈ ఓటమి ఝార్ఖండ్‌ను ఆపలేదు. ఇప్పటికే ఈ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో 8 పాయింట్లు సాధించి, మంచి నెట్ రన్‌రేట్ (+0.221)తో గ్రూప్ ఏలో టాప్‌లో నిలిచింది. ఇదే సమయంలో ఆంధ్ర మాత్రం నెట్ రన్‌రేట్ (-0.113)తో వెనకబడిపోయింది. దీంతో ఇది ఝార్ఖండ్ టీంకు కలిసి వచ్చింది. మంచి నెట్ రన్‌రేట్ ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైన ఝార్ఖండ్ జట్టు మాత్రం ఫైనల్‌కు అర్హత సాధించింది. నిజానికి ఇది ఝార్ఖండ్‌కు మొదటి ఎస్‌ఎంఏటీ ఫైనల్ అర్హత. 2006 నుంచి ఈ టోర్నీ జరుగుతున్నా, ఇప్పటి వరకు ఈ టీం ఫైనల్ మ్యాచ్ ఆడలేదు.

READ ALSO: Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’ తొలిరోజు భారత్ ఓడిపోయింది, విమానాలు కూలిపోయాయి: కాంగ్రెస్ మాజీ సీఎం.

Exit mobile version