Site icon NTV Telugu

Jerusalem: జెరూసలేంలో రక్తపాతం .. హమాస్ కాల్పుల్లో ఇజ్రాయెల్ పౌరులు మృతి

Jerusalem Shooting 2025

Jerusalem Shooting 2025

Jerusalem: ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేంలో దారుణం చోటుచేసుకుంది. జెరూసలేంలోని రామోట్ ప్రాంతంలో పట్టపగలు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మరణించగా, 15 మంది గాయపడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడికి హమాస్ బాధ్యత వహించింది. దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అత్యవసర భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పలు నివేదికలు బయటికి వచ్చాయి.

READ ALSO: Senior IAS Officers Transferred in AP: ఏపీలో 11 మంది సీనియర్‌ ఐఏఎస్‌ల బదిలీలు..

దాడి ఎక్కడ జరిగిందంటే..
జెరూసలేంలోని రామోట్ ప్రాంతంలో రద్దీగా ఉండే బస్ స్టాప్ దగ్గర ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఉన్నట్లుండి ఇద్దరు దుండగులు ఒక బస్సు ఎక్కి కాల్పులు ప్రారంభించారు. వెంటనే భద్రతా దళాలు వారిని అక్కడికక్కడే హతమార్చాయి. దాడి చేసిన వారు వెస్ట్ బ్యాంక్‌కు చెందిన పాలస్తీనియన్లు అని భద్రతా అధికారులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జెరూసలేంలో జరిగిన దాడిని హమాస్ ప్రశంసించింది. ఈ దాడిని వీరోచిత ఆపరేషన్ అని హమాస్ నాయకత్వం అభివర్ణించింది. ‘ఈ దాడి మన ప్రజలపై జరిగిన విధ్వంసక యుద్ధానికి ప్రతిస్పందన’ అని హమాస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్‌లో సోమవారం చోటుచేసుకున్న కాల్పుల సంఘటన 2024 అక్టోబర్ తర్వాత జరిగిన అతిపెద్ద కాల్పుల ఘటన. గత ఏడాది వెస్ట్ బ్యాంక్‌కు చెందిన ఇద్దరు పాలస్తీనియన్లు టెల్ అవీవ్‌లోని ఒక రైల్వే స్టేషన్‌పై కాల్పులు జరిపి 7 మందిని చంపారు. ఈ దాడికి హమాస్ బాధ్యత వహించింది. రామోట్ జంక్షన్ కాల్పులపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా భద్రతా దళాలు హై అలర్ట్‌ ప్రకటించాయి.

సంఘటనా స్థలానికి జాతీయ భద్రతా మంత్రి..
రామోట్‌లోని సంఘటనా స్థలానికి ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్ గ్విర్ చేరుకున్నారు. ఈసందర్భంగా ఆయన అక్కడి పరిస్థితిని పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాల్పుల తర్వాత ఇజ్రాయెల్ సైన్యం వెస్ట్ బ్యాంక్‌లోని రామల్లా శివార్లలోని అనేక పాలస్తీనా గ్రామాలలో గస్తీ పెంచింది. తాజాగా దాడి చేసిన వారు ఈ గ్రామాల నుంచి జెరూసలేం చేరుకున్నారని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.

READ ALSO: Mirai : చిరంజీవి అలా అంటారని అనుకోలేదు.. తేజసజ్జా కామెంట్స్

Exit mobile version