NTV Telugu Site icon

Jersey: గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని పోస్ట్ వైరల్..

1

1

హీరో నాని.. ఓ అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఆపై టాలీవుడ్ లో హీరోగా అంచలంచలుగా ఎదుగుతూ., ‘న్యాచురల్ స్టార్’ అని అభిమానులతో పీల్చుకుంటూ తనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ లిస్టులో చేసి సినిమా కూడా ఉంది. ఆ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. జెర్సీ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 19, 2019లో రిలీజ్ అయిన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకొని ఎన్నో అవార్డ్స్ ను గెలుచుకుంది. తల్లి కొడుకుల మధ్య జరిగే ఓ ఎమోషన్ తో కూడిన కథ ఈ జెర్సీ సినిమా.

Also read: Middle East: వెస్ట్ బ్యాంక్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి.. 14 మంది మృతి

ఓ కొడుకు కోసం 40 ఏళ్లు పైబడిన ఓ తండ్రి తన ఆరోగ్యం లెక్కచేయకుండా క్రికెటర్ గా ఎలా మారడన్నది సినిమా కథ. ఈ సినిమాలో హీరో నాని అర్జున్ పాత్రలో నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు గుప్పించారు. శనివారం నాటికి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఐదు ఏళ్ళు అయింది. ఈ సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో పలుచోట్ల సినిమా సంబంధించి స్పెషల్ షోస్ వేశారు. చాలా థియేటర్స్ లో నాని అభిమానులు పెద్ద ఎత్తున సినిమాను చూశారు. ఇకపోతే ఈ సందర్భంగా హీరో నాని చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Also read: DC vs SRH: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఫ్రేజర్-మెక్‌గర్క్.. ఏకంగా మూడు రికార్డ్స్!

ప్రేక్షకుల అభిమానానికి హీరో నాని కాస్త ఎమోషనల్ అయినట్లు కనపడుతుంది. జెర్సీ సినిమా స్పెషల్ షోస్ నుండి వస్తున్న అభిమానం చూస్తే తనకి ఆశ్చర్యం వేసిందని చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియా వేదికగా అభిమానులకు నాని థాంక్స్ చెప్పాడు. అంటూ తాను చేసిన ట్వీట్ లో హీరో నాని రాసుకోచ్చాడు.