NTV Telugu Site icon

Jellyfish: మెరిసే చేపను చూశారా? వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

Jellyfish

Jellyfish

చేపలు చాలా రకాలు ఉంటాయి.. సముద్రంలో ఉన్న చేపలకు నదుల్లో చేపలకు చాలా తేడాలు ఉంటాయి.. రంగుల చేపలను మనం చూసే ఉంటాం.. కానీ మెరిసే చేపలను ఎప్పుడూ చూసి ఉండరు.. అలాంటి చేపలను తాజాగా శాస్త్రవేత్తలు తయారు చేశారు.. అవి అచ్చం చూడటానికి లైట్ లాగా మెరుస్తూ ఉన్నాయి.. ఆ చేపలకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఈ చేపలను శాస్త్రవేత్తలు సృష్టించారు.. జన్యులను మార్చేస్తే జంతువులు లేదా జీవులు కొత్త విధులను కూడా చేయగలవు.. ఈ టెక్నాలజీ ఒక అద్భుతం అని చెప్పవచ్చు. అయితే ఒకానొక సమయంలో దీనిని ఉపయోగించి తైవాన్‌లోని శాస్త్రవేత్తలు మెరుస్తున్న చేపలను సృష్టించారు.. వాటిని జెల్లీ ఫిష్ లను కార్ప్ చేపల డీఎన్ఏలోకి ప్రవేశపెట్టారు.. అలా వచ్చిన చేపలే ఈ మెరిసే చేపలు.. అచ్చం రేడియం లైట్లు లాగే ఉన్నాయి.. ఈ చేపల వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చెయ్యగా ఇప్పటివరకు కోటి 78 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి..

ఈ చేపలను సృష్టించడానికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఎన్విరాన్‌మెంటల్ అప్లికేషన్స్ కోసం వీటిని సృష్టించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. ఈ మెరుస్తున్న కార్ప్‌లను నీటి వనరులలో కాలుష్య స్థాయిలను గుర్తించడానికి ఎన్విరాన్‌మెంటల్ సెన్సార్లుగా ఉపయోగించవచ్చు. వాటి గ్లో తీవ్రత కాలుష్య కారకాల ఉనికిని, గాఢతను సూచిస్తుంది, నీటి నాణ్యతను అంచనా వేయడానికి విజువల్ ఇండెక్స్ కూడా అందిస్తుంది… జీవులలోని కణాల ప్రవర్తన, కదలికలను ట్రాక్ చేయడానికి, సంక్లిష్ట జీవ ప్రక్రియలను తెలుసుకోవడం కోసం వీటిని సృష్టించినట్లు చెబుతున్నారు..