Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దివంగత అమెరికా వ్యాపారవేత్త, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ నెట్‌వర్క్‌పై ఫ్రాన్స్‌లో జరుగుతున్న విచారణలో ఒక కీలకమైన మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో మరో పది మంది కొత్త బాధితులు తాజాగా తమ గళాన్ని విప్పారని పారిస్ ప్రాసిక్యూటర్ ఆదివారం ప్రకటించారు.
అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఈ ఏడాది జనవరిలో ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన కీలక పత్రాలను విడుదల చేసింది. ఆ పత్రాల ఆధారంగా ఫ్రాన్స్ ప్రభుత్వం మానవ అక్రమ రవాణాపై విచారణను ప్రారంభించింది. మైనర్ బాలికలను లైంగిక వేధింపుల కోసం రవాణా చేసిన ఆరోపణలపై ఎప్స్టీన్ 2019లో జైలులో ఉండగానే మరణించాడు. అయితే.. ఫ్రాన్స్‌లో ఎప్స్టీన్కు సహకరించిన వారు ఎవరు? అక్కడ జరిగిన నేరాలు ఏమిటి? అనే కోణంలో ఫ్రెంచ్ అధికారులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
పారిస్ టాప్ ప్రాసిక్యూటర్ లారే బెక్వా మాట్లాడుతూ.. బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి మాట్లాడాలని తాము ఫిబ్రవరిలో కోరినట్లు తెలిపారు. ఆ తర్వాత సుమారు 20 మంది బాధితులు తమను సంప్రదించారని ఆమె చెప్పారు. వారిలో కొందరు ఇప్పటికే దర్యాప్తు అధికారులకు తెలిసినవారే అయినప్పటికీ, మిగిలిన పది మంది మాత్రం పూర్తిగా కొత్తవారని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఈ బాధితులందరి స్టేట్మెంట్లను రికార్డ్ చేయడమే తమ మొదటి ప్రాధాన్యత అని బెక్వా పేర్కొన్నారు. వీరిలో కొందరు విదేశాలలో ఉన్నందున, వారు పారిస్ రావడానికి వీలుగా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
దీనితో పాటు.. ఎప్స్టీన్కు సంబంధించిన పాత ఫైళ్లు, కంప్యూటర్లు, ఫోన్ రికార్డులు, అడ్రస్ బుక్‌లను అధికారులు మళ్లీ పరిశీలిస్తున్నారు. బాధితులు చెప్పే పేర్లతో వీటికి ఏమైనా సంబంధం ఉందా అని చూస్తున్నారు. అవసరమైతే అంతర్జాతీయ సహాయం కూడా తీసుకోనున్నారు. 2019లో ఎప్స్టీన్ మరణించిన తర్వాత పారిస్‌లోని అతని లగ్జరీ అపార్ట్మెంట్లో సోదాలు జరిగాయి. ఫ్రాన్స్‌లో కూడా అతను యువతులను వేధించాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే… ఈ కేసులో అనుమానితులుగా ఉన్న ఎవరినీ అధికారులు ఇంకా ప్రశ్నించలేదు. ఎప్స్టీన్కు గతంలోనే 2008లో ఒక మైనర్ బాలికను వ్యభిచారంలోకి దించినందుకు శిక్ష పడింది, అప్పట్లో అతను 13 నెలలు జైలులో గడిపాడు.
తాజావార్తలు
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!