Site icon NTV Telugu

Jeff Bezos Charity: ప్రపంచ కుబేరుడి దాతృత్వం.. సంపదలో ఎక్కువ భాగం విరాళాలకే

Bazos

Bazos

Jeff Bezos Charity: ప్రపంచ కుబేరుడు, ప్రముఖ ఈ కామర్స్ పోర్టల్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన సంపాదనపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. తాను సంపాదించిన దాంట్లో అధిక భాగం దాతృత్వ కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని వెల్లడించారు. అత్యంత సంపాదకుల్లో ఒకడై ఉండి కూడా సామాజిక సేవా కార్యక్రమాలకు ఒక్క పైసా విదల్చడంటూ బెజోస్ పై ఇటీవలి వరకు విమర్శలు వస్తుండేవి. బిల్ గేట్స్ వంటి ప్రముఖులు ప్రపంచక్షేమం కోరి పెద్ద మొత్తంలో చారిటీలకు విరాళాలు ఇస్తుంటే, బెజోస్ మాత్రం వ్యాపార చట్రం నుంచి బయటికి రావడంలేదని వ్యాఖ్యలు వినిపించాయి. 124 బిలియన్ డాలర్ల నికర సంపదను కలిగిన బెజోస్ ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ఇప్పుడా విమర్శలకు బెజోస్ తన ప్రకటనతో అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. తన ఆస్తిలో మెజారిటీ వాటాను వాతావరణ మార్పులపై పోరాటానికి అందిస్తానని ఇటీవల సీఎన్ఎన్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెజోస్ తెలిపారు. అంతేకాదు, సామాజికంగా, రాజకీయంగా తీవ్రస్థాయిలో విడిపోయిన మానవత్వాన్ని తిరిగి ఏకం చేయగల వ్యక్తులకు మద్దతు ఇచ్చేందుకు తన ఆస్తిని వినియోగిస్తానని కూడా పేర్కొన్నారు. కాగా, బెజోస్ తన విరాళాలకు కాల పరిమితి విధించలేదు. తన సంపదలో చాలా వరకు తన జీవితకాలంలో విరాళంగా ఇచ్చేస్తానని ప్రకటించారు.

Exit mobile version