Site icon NTV Telugu

JEE Mains Session 2 Result 2026: జేఈఈ ఫలితాలు విడుదల.. రిజల్డ్స్ చెక్ చేసుకోండిలా..

Ap Tet Results 2024

Ap Tet Results 2024

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2026 ఫలితాలను విడుదల చేసింది. జనవరి , ఏప్రిల్ నెలల్లో జరిగిన రెండు సెషన్లకు సంబంధించిన తుది ఫలితాలు, ఆల్ ఇండియా ర్యాంకులు (AIR) ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్ , పుట్టిన తేదీ వివరాలను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్  ద్వారా స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ ఏడాది రికార్డు స్థాయిలో అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, అభ్యర్థులు రెండు సెషన్లలో పాల్గొన్న సందర్భంలో వారి ఉత్తమ పర్సంటైల్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని తుది ర్యాంకును కేటాయించారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కటాఫ్ పర్సంటైల్ గతంతో పోలిస్తే ఈసారి కొంత పెరిగి 93.5 పర్సంటైల్ మార్కును తాకింది.

ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించడానికి సుమారు 2.5 లక్షల మంది విద్యార్థులను ఎంపిక చేశారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ నుంచి పలువురు విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించి జాతీయ స్థాయి టాపర్లుగా నిలిచారు.

ఫలితాల ప్రకటనతో పాటు ఎన్టీఏ తుది ‘కీ’ని కూడా వెల్లడించింది. అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి దశలో జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి జోసా కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా త్వరలోనే విడుదల కానుంది. విద్యార్థులు తాజా సమాచారం కోసం నిరంతరం అధికారిక పోర్టల్‌ను గమనిస్తూ ఉండాలని అధికారులు సూచించారు.

Exit mobile version