Site icon NTV Telugu

JEE Main: జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 ఫైనల్‌ ‘కీ’ వచ్చేసింది..

Jee

Jee

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 పరీక్షకు తుది ఆన్సర్ కీని అధికారికంగా విడుదల చేసింది. ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in నుంచి తుది ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 11న తాత్కాలిక ఆన్సర్ కీని విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఫైనల్‌ కీని సైతం రిలీజ్ చేసింది. అభ్యంతరాలను లేవనెత్తడానికి ఏప్రిల్ 13 వరకు సమయం ఉంది. జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్ష ఫలితాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.

READ MORE: Fugitive Economic Offender: బ్యాంకులను మోసం చేసి.. విదేశాలకు పారిపోయిన బడా వ్యాపారవేత్తలు వీళ్లే..

కాగా.. సెషన్ 2 పరీక్షకు 10 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. గత జనవరి, ఇటీవల జరిగిన రెండు విడతల పరీక్షల్లోని ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులు కేటాయిస్తారు. అయితే, జేఈఈ-మెయిన్‌ పరీక్ష సమాధానాల్లో పలు తప్పిదాలు ఉన్నాయని ఫిర్యాదులు వస్తుండడంపై ఇటీవల స్పందించిన ఎన్‌టీఏ.. తుది ‘కీ’ వచ్చే వరకు విద్యార్థులు వేచి చూడాలని సూచించింది. తుది ‘కీ’ మాత్రమే స్కోరును నిర్ణయిస్తుంది.

READ MORE: 2025 Skoda Kodiaq: దుమ్మురేపే ఫీచర్లతో స్కోడా కొడియాక్ రిలీజ్.. ధర ఎంతంటే?

Exit mobile version