NTV Telugu Site icon

JC Prabhakar Reddy : అభివృద్ధికి 15 శాతం కమిషన్‌ ఇవ్వాలి.. జేసీ ప్రభాకర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jc Prabhakar Reddy

Jc Prabhakar Reddy

మొన్నటి వరకు ఏపీలో ఇసుక దోపిడీపై పెద్ద సంఖ్యలో ఆరోపణలు వచ్చాయి, ఇక ఇప్పుడు మద్యం దుకాణాల టెండర్ల వ్యవహారం కాంట్రవర్సీకి దారితీస్తోంది. ఇసుక దోపిడీతో సంబంధించి, తెలుగుదేశం పార్టీ నాయకులపై ఆరోపణలు పెరుగుతూనే ఉన్నాయి. ట్రాక్టర్లు, లారీల డ్రైవర్ల నుండి కమీషన్లు దండించడంతో పాటు, ప్రజలపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. “ఉచిత ఇసుక” పేరుతో జరిపే అక్రమాలకు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, దీనికి సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు స్పందిస్తున్నారు.

 
Jagga Reddy: ఎంత తోపులం అయిన సరే ఓ రోజు కాటికి వెళ్ళక తప్పదు..
 

జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా మద్యం దుకాణాల టెండర్లపై కూడా స్పందించారు. ఆయన విడుదల చేసిన వీడియోలో, ప్రతి మండలానికి 15 పైసల కమీషన్ ఇవ్వాల్సి ఉంటుందని, తనతో పెట్టుబడులు పెట్టినట్లు, ఆ షాపుల ద్వారా తాను రూ. 20 పైసలు తీసుకోవాలనుకుంటున్నట్టు తెలిపారు. ఈ కమీషన్ ద్వారా తాను తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధికి ఖర్చు చేస్తానని స్పష్టం చేశారు. ఇసుక వ్యాపారం, క్లబ్స్‌ నడిపేవారు 15 శాతం నియోజకవర్గం కోసం కమీషన్ ఇవ్వాల్సిందే అని ఆయన అన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి నేను 20 శాతం డబ్బులు ఖర్చు పెడతానని, తాడిపత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. నాకు ఒక్క ప్తెసా కూడా వద్దు…. నియోజక అభివృధ్ధి విషయంలో కఠినంగా ఉంటానని, 1952 నుంచి రాజకీయాల్లో ఉన్నాం.. ప్రజలు మమల్ని ఆదరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లల్లో చాలా ఇబ్బందులు పెట్టారు … బస్సులు , లారీలులేకుండా చేశారన్నారు.

Baba Siddique : ముంబైలో ఎన్సీపీ నాయకుడు మాబా సిద్ధిఖీ దారుణ హత్య.. ఇద్దరు నిందితుల అరెస్ట్