Site icon NTV Telugu

JC Prabhakar Reddy: ఒక రైతుగా జిల్లా కలెక్టర్ను కలిశా.. దీన్ని రాజకీయం చేయొద్దండి

Jc

Jc

JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా పుట్లూరు మండల రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ కు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పుట్లూరు మండలంలోని సుబ్బరాయ సాగర్ కి నీటిని విడుదల చేయాలని కోరారు. ఇక, మాజీ ఎమ్మెల్యే జేసీ మాట్లాడుతూ.. గత రెండు నెలల కిందట సుబ్బరాయ సాగర్ లో 11.4 మీటర్ల నీరు ఉంది.. గేట్లు తెరుచుకోకపోవడం తమ దురదృష్ట్రం అన్నారు. అందువల్ల నీరు మొత్తం 29వ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి బొప్పేపల్లి చెరువుకు మళ్ళించడం జరిగిందని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

Read Also: KTR: నేను మా నాన్న పేరు చెప్పుకుంటే తప్పేమిటి?.. తెలంగాణ తెచ్చిన మొనగాని పేరు చెప్పుకుంటే తప్పా?

అయితే, పుట్లూరు, కోమటికుంట్ల, గరుగు చింతలపల్లి చెరువులను నీటితో నింపలేక పోయారని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు ఈ గేట్లకు మరమ్మత్తులు చేయించడం జరిగింది.. ఇప్పుడు పెనకచర్ల డ్యామ్ నుంచి సుబ్బరాయ సాగర్ కు నీటిని రిలీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ ని కోరాం.. నీరు ఇవ్వకపోతే పుట్లూరు మండలంలోని రైతులు నష్టపోతారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆనంద్ సానుకూలంగా స్పందించారు.. ఒక రైతుగా జిల్లా కలెక్టర్ ని కలిశాను.. దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దండి అన్నారు. పుట్లూరు మండలంలో నాకు భూమి ఉందని జేసీ ప్రభాకర్ తెలియజేశారు.

Exit mobile version