Site icon NTV Telugu

Jawan : ఓటీటీ లోకి వచ్చేసిన షారుఖ్ సూపర్ హిట్ మూవీ..

Whatsapp Image 2023 11 02 At 12.12.34 Pm

Whatsapp Image 2023 11 02 At 12.12.34 Pm

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు.ఈ చిత్రంలో సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార షారుఖ్ సరసన హీరోయిన్ గా నటించింది..ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ తండ్రి కొడుకులు గా రెండు పాత్ర లలో నటించాడు..రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌లో షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాతో అటు అట్లీ, నయనతార ఇద్దరూ బాలీవుడ్‍కు ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు…ఈ సినిమా సెప్టెంబర్ 7న హిందీ తో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో వరల్డ్ వైల్డ్ గా విడుదలైన జవాన్ సినిమా వేల కోట్ల వసూళ్లు రాబట్టింది. అయితే, ఇప్పుడు జవాన్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

షారుక్ ఖాన్ బర్త్ డే సందర్భంగా నవంబర్ 2 నుంచి నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ లో కనిపించని అదనపు సన్నివేశాలను కూడా జోడించి ఈ చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చేశారు.దీనితో థియేటర్లలో జవాన్ మూవీ చూసిన వారు మళ్లీ ఓటీటీ లో చూసేలా ప్లాన్ చేశారు మేకర్స్. ఓటీటీలో జవాన్ మూవీ రన్ టైమ్ థియేటర్లో ఉన్న దానికంటే ఎక్కువగా ఉంది. దీంతో షారుక్ ఫ్యాన్స్ ఎంతో సంబరపడి పోతున్నారు. ఇదిలా ఉంటే జవాన్ సినిమా లో నయనతార, షారుక్ ఖాన్‍తోపాటు బాలీవుడ్ హాట్ బ్యూటి దీపికా పదుకొణె, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ప్రియమణి, సాన్య మల్హోత్రా, రిధి డోగ్రా, బిగ్ బాస్ సిరి హన్మంతు, యోగిబాబు, సంజయ్ దత్ మరియు సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు.ఈ సినిమా లో విజయ్ సేతుపతి విలన్‌గా నటించారు..అలాగే దీపికా పదుకొన్ ముఖ్య పాత్ర పోషించింది.

Exit mobile version