Jawan : ఓటీటీ లోకి రాబోతున్న షారుఖ్ సూపర్ హిట్ మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్.. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. షారుఖ్‌ఖాన్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 2న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.హిందీతో పాటు తెలుగు,తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ సంబంధించిన ప్రకటన ఆదివారం లేదా సోమవారం అధికారికంగా రిలీజ్ కానున్నట్లు సమాచారం.. జవాన్ మూవీకి సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు.యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన జవాన్ మూవీ 1150 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన ఐదో సినిమాగా జవాన్ రికార్డ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో సెకండ్ హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది..జవాన్ సినిమా ఓటీటీ హక్కులను దాదాపు 250 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.
షారుఖ్ ఖాన్ కెరీర్‌లోనే అత్యధిక ధరకు ఓటీటీ హక్కులు అమ్ముడుపోయిన సినిమాగా జవాన్ నిలిచింది.జవాన్ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతోనే నయనతార హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. దీపికా పడుకోణ్ ముఖ్య పాత్రలో నటించింది. జవాన్ సినిమాకు కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతాన్ని అందించాడు.ఈ సినిమా కథ విషయానికి వస్తే జవాన్ సినిమాలో ఆజాద్, విక్రమ్ రాథోడ్ అనే రెండు పాత్రల్లో షారుఖ్‌ఖాన్ తన నటనతో అదరగొట్టాడు… మైట్రో ట్రైన్‌ను విక్రమ్ రాథోడ్ అనే వ్యక్తి హైజాక్ చేస్తాడు. ఈ హైజాక్ కేసును నర్మద (నయనతార) చేపడుతుంది. మెట్రో ట్రైన్‌ను విక్రమ్ రాథోడ్ ఎందుకు హైజాక్ చేశాడు..ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఆజాద్‌తో విక్రమ్ రాథోడ్‌కు ఉన్న సంబంధం ఏమిటి.. వెపన్ డీలర్ కాళీపై (విజయ్ సేతుపతి) పగతో విక్రమ్ రాథోడ్ రగిలిపోవడానికి కారణం ఏమిటి..అనేదే ఈ సినిమా కథ. జవాన్ సినిమాలోని యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయిస్తాయి..
Also Read
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
- Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
తాజావార్తలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!