అనిరుద్ రవిచందర్..ఈ యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.తమిళ చిత్ర పరిశ్రమలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు.. వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలతో అదిరిపోయే క్రేజ్ ను సంపాదించు కున్నాడు.ప్రస్తుతం కోలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలన్నిటికీ కూడా ఈయనే సంగీతం అందిస్తున్నాడు.కోలీవుడ్ లో బాగా క్రేజ్ రావడంతో ఈయన తెలుగు సినిమాల కు కూడా మ్యూజిక్ అందించే అవకాశం అందుకున్నాడు.తెలుగులో ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు అనిరుధ్..ఇలా వరుస గా స్టార్ హీరో ల సినిమాల కు పని చేస్తున్నాడు.ప్రస్తుతం అనిరుద్ రవిచందర్ కోలీవుడ్ మరియు టాలీవుడ్ లో వరుస సినిమాలను లైన్లో పెట్టాడు.
అలాగే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ సినిమా కు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జవాన్ సినిమా లో షారుఖ్ ఖాన్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు.. ఈ భారీ యాక్షన్ సినిమాను పాన్ ఇండియా స్థాయి లో సెప్టెంబర్ 7 న విడుదల చేయబోతున్నారు. అలాగే ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ప్రియమణి, సునీల్ గ్రోవర్, సన్యా మల్హోత్రా వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాకు అనిరుద్ రికార్డ్ స్థాయి లో పారితోషకం అందుకున్నట్లు సమాచారం.అనిరుధ్ ఈ సినిమాకు ఏకంగా 10 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నాడని సోషల్ మీడియలో తెగ వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా వున్న ఏ.ఆర్. రెహ్మాన్ కూడా ఈ రేంజ్ పారితోషకం తీసుకోలేదు. దీనితో అనిరుధ్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.
