Site icon NTV Telugu

JLN Stadium: క్రికెట్ స్టేడియం కూల్చివేయబోతున్నారు.. ఎందుకో తెలుసా?

Jawaharlal Nehru Stadium De

Jawaharlal Nehru Stadium De

JLN Stadium: క్రికెట్ అనే ఒక మతం ఉంటే దానికి భారతదేశంలోనే ఎక్కువ మంది అనుసరించే వారు ఉంటారనే నానుడి వాడుకలో ఉంది. ఇంతటి అభిమానులు ఉన్న క్రికెట్‌కు సంబంధించిన ఒక స్టేడియాన్ని కూల్చివేయబోతున్నారు. ఎక్కడో తెలుసా.. దేశ రాజధాని ఢిల్లీలో. ఎందుకంటే ఈ స్టేడియం ఉన్న ప్రాంతంలో ఒక ప్రధాన క్రీడా ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని క్రీడా మంత్రిత్వ శాఖ ప్లాన్ చేస్తుంది. క్రీడా మంత్రిత్వ శాఖలోని ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం.. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం కూల్చివేసి, దాని స్థానంలో కొత్త “స్పోర్ట్స్ సిటీ”ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు 102 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు.

READ ALSO: Chiranjeevi – Ram Charan : మొన్న చిరంజీవి.. నేడు రామ్ చరణ్‌.. అదరగొట్టారుగా..

సరికొత్త క్రీడా నగరం..
ఖతార్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో ఉపయోగించే ఆధునిక క్రీడా నమూనాల ఆధారంగా కొత్త క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఢిల్లీలో అత్యాధునిక క్రీడా మౌలిక సదుపాయాలను సృష్టించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం ప్రస్తుతం ఉన్న భూమిని పూర్తిగా అభివృద్ధి చేస్తామని అధికారిక వర్గాలు తెలిపాయి. కొత్త స్పోర్ట్స్ సిటీ 102 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుందని, ఇది దేశంలోని ప్రధాన క్రీడా సౌకర్యాలలో ఒకటిగా మారుతుందని ప్రకటించారు. క్రీడలకు అంకితమైన సమగ్ర, ఆధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా వాళ్లు పేర్కొన్నారు. ఈ కొత్త క్రీడా నగరం ప్రపంచ స్థాయిగా ఉండేలా చూసుకోవడానికి, క్రీడా మంత్రిత్వ శాఖ బృందాలు ఖతార్, ఆస్ట్రేలియాలో విజయవంతమైన క్రీడా నమూనాలను నిశితంగా అధ్యయనం చేస్తున్నాయని తెలిపారు. ఈ అంతర్జాతీయ నమూనాల నుంచి నేర్చుకున్న విషయాలను డిజైన్, సౌకర్యాలను ఖరారు చేయడానికి ఉపయోగిస్తారని వెల్లడించాయి.

ఆసియా క్రీడల కోసం ఏర్పడిన స్టేడియం..
జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం 1982 ఆసియా క్రీడల కోసం నిర్మించారు. తరువాత 2010 కామన్వెల్త్ క్రీడల కోసం దీనిని పునరుద్ధరించారు. ఇది చాలా కాలంగా భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ బహుళ-క్రీడా వేదికలలో ఒకటిగా ఉంది. దీని సామర్థ్యం సుమారు 60 వేల మంది, ఈ స్టేడియం ప్రధాన అథ్లెటిక్స్ ఈవెంట్‌లు, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, పెద్ద కచేరీలు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలతో సహా జాతీయ వేడుకలకు ఆతిథ్యం ఇచ్చింది. చారిత్రాత్మకంగా ఈ స్టేడియం జాతీయ అథ్లెటిక్స్ జట్టుకు నిలయంగా ఉంది, అలాగే నాలుగు దశాబ్దాలకు పైగా భారతదేశ క్రీడా చరిత్రలో ముఖ్యమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు న్యూఢిల్లీలోని JLN స్టేడియంలో జరిగాయి. ఈ ఈవెంట్ కోసం దాదాపు రూ.30 కోట్ల వ్యయంతో ఒక మోండో ట్రాక్‌ను కూడా వేశారు.

READ ALSO: CCRH Recruitment 2025: సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతిలో జాబ్స్.. అర్హులు వీరే

Exit mobile version