Site icon NTV Telugu

Jatadhara: అక్టోబర్ 1న ధన పిశాచి వస్తోంది!

Jatadhara Movie

Jatadhara Movie

Jatadhara: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ ఫీల్ అందించే ఈ పాన్-ఇండియా బై లింగ్యువల్ చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది. ఈమధ్యన రిలీజ్ అయిన టీజర్ నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యింది. ఫస్ట్ ట్రాక్ ‘సోల్ ఆఫ్ జటాధార’ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

READ ALSO: KTR : 2028లో తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, సీఎం కేసీఆర్ మళ్లీ అవుతారు

విజయదశమి కానుకగా ఈ సినిమా నుంచి అక్టోబర్ 1న ధన పిశాచి సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ అదిరిపోయింది. జటాధరలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, సుభలేఖ సుధాకర్‌తో పాటు ప్రముఖ నటులు కనిపించనున్నారు. మంచికి–చెడుకి, వెలుగుకి–చీకటికి, మానవ సంకల్పానికి– విధికి మధ్య జరిగే అద్భుతమైన పోరాటాన్ని ఈ చిత్రం చూపించబోతోంది. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరు‍ణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

READ ALSO: Argentina Protests: అర్జెంటీనాలో ప్రజాగ్రహం.. దేశాన్ని కమ్మేసిన నిరసనలు..

Exit mobile version