NTV Telugu Site icon

Japan Dog Man: కుక్క బతుకు బాగుంటుంది అనుకుంటే.. నిజంగానే కుక్క బతుకైంది

Japan Dog

Japan Dog

Japan Dog Man: మనిషికి కోరికలు సహజం.. కొందరికి విచిత్రమైన కోరికలు కలుగుతాయి. ఆ మధ్య జపాన్ రాజధాని టోక్యోకు చెందిన ఓ వ్యక్తికి కూడా వింత కోరికే కలిగింది. తాను నాలుగు కాళ్ల జంతువుగా మారిపోవాలనుకున్నాడు. తనకు కుక్క రూపమైతే సరిగ్గా సరిపోతుందని అతడు భావించాడు. తన ఒళ్లంతా బొచ్చుతో పెద్దగా ఉండే జాతి కుక్క ‘కోలీ’గా మారిపోవాలనుకున్నాడు. దీని కోసం జెప్పెట్ అనే ప్రొఫెషనల్ ఏజెన్సీని సంప్రదించాడు. సుమారు రెండు మిలియన్ యెన్లు అంటే భారత కరెన్సీలో రూ.12 లక్షలు ఖర్చు చేశాడు. 40 రోజుల వ్యవధిలో జాతి కుక్క కోలీ కాస్ట్యూమ్స్‌ను జెప్పెట్ సంస్థచే తయారు చేయించుకున్నాడు.

Read Also: Boat Capsized : మానేరులో పడవ మునక.. ఏడుగురు గల్లంతు

ఈ కాస్ట్యూమ్స్ ధరించి అచ్చం కుక్కలా మారిపోయాడు. కుక్క మాదిరిగా హావాభావాలు ప్రదర్శించాడు. కుక్క మాదిరిగా నడిచేందుకు ప్రయత్నించాడు. కొందరు వీడియోలు తీసి వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అవి బాగా వైరల్ అయ్యాయి. అయితే.. ఇంతకాలం కుక్క తరహాలో వీడియోలు చేస్తూ పోతున్న టోకో.. ఇప్పుడు సడన్‌గా బాధను. భయాన్ని వ్యక్తం చేశాడు. తాను తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ఎలాంటి పరిణామానికి దారి తీస్తుందో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. జంతువులా ఉండాలని చిన్నప్పుడు అనుకునేవాడిని. కుక్క తరహా జీవనం.. నాకు హాయిగానే అనిపిస్తోంది. కానీ, ఇప్పుడు నాది నిజంగానే కుక్క బతుకు అయ్యింది. రాను రాను ఈ చర్య.. నావాళ్లను నాకు దూరం చేస్తుందనే భయం రేకెత్తిస్తోంది ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వీలైనంత త్వరలో ఈ రూపానికి స్వస్తి పలుకుతానని చెబుతున్నాడు టోకో.