NTV Telugu Site icon

Nadendla Manohar:వైసీపీని నడిపిస్తోంది ఐ ప్యాక్ టీమే

Nadendla Manohar On Ap Govt

Nadendla Manohar On Ap Govt

అధికార వైసీపీపై మండిపడ్డారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. కొన్ని చోట్ల బీజేపీకి అభ్యర్థులు లేరు.. కొన్ని చోట్ల ఏకగ్రీవాలయ్యాయి.అందుకే వైసీపీ అభ్యర్ధులను ఓడించాలని పిలుపిస్తున్నాం.విశాఖలో ఆందోళన కలిగించే రీతిలో పెట్టుబడుల సదస్సు.విశాఖే రాజధాని అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నారన్నారు.

Read Also: AP New Mandals:ఏపీలో కొత్తగా ఆరుమండలాల ఏర్పాటుకి నోటిఫికేషన్

విశాఖలో పెట్టుబడిదారుల కోసం వాహానాలు కూడా ప్రభుత్వం అరేంజ్ చేయలేకపోతోంది.పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు.విశాఖ నుంచి తరలివెళ్లిన పరిశ్రమలను తిరిగి తెచ్చి ఆ తర్వాత పెట్టుబడుల సదస్సు పెడితే బాగుంటుంది.దమ్ముంటే 175 సెగ్మెంట్లల్లో రోడ్లు వేయమనండి.175 నియోజకవర్గాలకు ఐ ప్యాక్ లేకుండా రమ్మనండి.రోడ్ వేయాలన్నా ఐ ప్యాక్ టీమే చెప్పాలి.వైసీపీని నడిపిస్తోంది ఐ ప్యాక్ టీమే అని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.

మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నాం అన్నారు. బందరులో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ‍ ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ప్రభుత్వాలను ప్రశ్నించే విధంగా జనసేన కృషి చేస్తోంది.అందరిని సమానంగా చూడడమే జనసేన లక్ష్యం.ఎన్నో కష్ట నష్టాలను భరించి పవన్ నేతృత్వంలో జనసేన నడుస్తోంది.పార్టీ ఆవిర్భావం జరిగి 9 ఏళ్లు అయింది.. పదో వార్షికోత్సవం జరుపుకుంటున్నాం.

కనివినీ ఎరుగని రీతిలో ఆవిర్భావ సభ చేపడతాం.సభకు వచ్చే వారి కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేపడుతున్నాం. బందరులో 34 ఎకరాల సభా ప్రాంగణంలో సభ నిర్వహిస్తున్నాం.జాతీయ భావన స్ఫూర్తి రగిలించేలా సభా ప్రాంగణానికి పింగళి వెంకయ్య పేరు పెడుతున్నాం.పొట్టి శ్రీరాములు త్యాగాలను గుర్తించేలా వేదికకు పొట్టి శ్రీరాములు పేరు పెడుతున్నాం.

Read Also: IND vs AUS: మూడో టెస్టులో గట్టి పోటీ.. ఆధిక్యంలో ఆసీస్‌ జట్టు

సుభాష్ చంద్రబోస్ పోరాటాన్ని గుర్తు చేసేలా సభా నిర్వహణ ఉంటుందన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేలా సభ నిర్వహిస్తాం. మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి వారాహి వాహానంలో బందరు సభా వేదికకు పవన్ చేరుకుంటారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ బందరు వెళ్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు వైసీపీకి వ్యతిరేకంగా ఓటేయాలని పవన్ పిలుపు ఇస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు వ్యతిరేకంగా జనసేన శ్రేణులు పని చేయాలి.