Janhvi Kapoor’s Jersey 6 Blouse Shakes Internet: రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అపూర్వ మోహతా, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో మహేంద్ర పాత్రలో రాజ్‌కుమార్, మహిమ పాత్రలో జాన్వీ కనిపించనున్నారు. ఈ చిత్రం మే 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.
‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నేడు ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఈవెంట్‌లో జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నిన్న బాడీకాన్ డ్రెస్‌లో మెరిసిన జాన్వీ.. నేడు క్రేజీ శారీలో దర్శనమిచ్చారు. రెడ్ అండ్ బ్లూ కలర్ శారీలో జాన్వీ ఆకట్టుకున్నారు. అయితే అందరి కళ్లు ఆమె బ్లౌజ్‌పైనే పడ్డాయి. ఎందుకంటే.. క్రికెట్ బంతిని పోలిన లెదర్ బ్లౌజ్ జాన్వీ వేసుకున్నారు. క్రికెట్ బంతికి ఎలా కుట్లు ఉంటాయో.. ఆమె బ్లౌజ్‌లో కూడా అదే తరహా కుట్లు ఉన్నాయి. బ్లౌజ్ వెనకాల ‘మహి 6’ అని రాసి ఉంది.
Also Read: Chennai Super Kings: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన రికార్డు!
మిస్టర్ అండ్ మిసెస్ మహి ట్రైలర్ ఈవెంట్‌లో జాన్వీ కపూర్ శారీ, బ్లౌజ్ అందరిని ఆకట్టుకున్నాయి. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాన్వీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోస్ షేర్ చేశారు. ట్రైలర్ డే అని రెడ్ హార్ట్ ఎమోజిని పోస్ట్ చేశారు. తెలుగులో జాన్వీ ‘దేవర’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ సరసన కూడా ఆమె నటించాల్సి ఉంది.
