NTV Telugu Site icon

Janhvi Kapoor : ఎన్టీఆర్ తో నటించడం కోసం ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్న హాట్ బ్యూటీ..

Whatsapp Image 2023 08 04 At 3.42.01 Pm

Whatsapp Image 2023 08 04 At 3.42.01 Pm

జాన్వీ కపూర్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ శ్రీదేవి వారసురాలు గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.ఈమె ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది.తెలుగు లో ఎన్టీఆర్ హీరో గా నటిస్తున్న దేవర సినిమా తో హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి.. కొరటాల శివ ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ దేవర సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఎన్టీఆర్ సినిమా కోసం తాను ఏడాది పాటు సినిమాల కు దూరంగా ఉండాలని నిర్ణయించు కున్నట్లు జాన్వీ తెలియజేశారు. ఎన్టీఆర్ తో సినిమా చేయాలని జాన్వీ కపూర్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారట.అయితే దేవర సినిమా ప్రకటించిన సమయంలో ఈ సినిమా లో అవకాశం పొందాలని జాన్వీ కపూర్ ఎంతగానో కోరుకున్నారట. ఈ క్రమంలోనే తాను ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటే ఈ సినిమా లో చేసే ఛాన్స్ తనకే వస్తుందని భావించి ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తాజాగా వెల్లడించారు. అయితే ఈమె కోరుకున్నట్టుగానే దేవర సినిమాలో అవకాశం రావడంతో ఎంతో సంతోషం గా ఉంది అని ఆమె తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో కూడా పలు సినిమాల లో నటిస్తూ బిజీ గా ఉన్నారు. ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ లో కూడా ఈ భామ ఎంతో బిజీ గా ఉంది.. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.