NTV Telugu Site icon

Janhvi Kapoor : ఆ రూమర్ పై స్పందించిన దేవర బ్యూటీ..

Whatsapp Image 2024 05 08 At 8.17.26 Am

Whatsapp Image 2024 05 08 At 8.17.26 Am

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఈ భామ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.తన అందం ,నటనతో బాలీవుడ్ లో ఈ భామ వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలతో బిజిబీజీగా వుంది.మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రంతో ఆమె టాలీవుడ్‍లో ఎంట్రీ ఇస్తున్నారు.ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మయి తంగం పాత్రను ఆమె పోషిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రాంచరణ్ తో కూడా జాన్వీ కలిసి నటించనున్నారు. రాంచరణ్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కనున్న మూవీ “ఆర్సి 16 ” లో జాన్వీ హీరోయిన్‍గా నటించనున్నారు.

బాలీవుడ్‍లో ఈ భామ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహీ, ఉల్జాతో పాటు మరో మూవీ కూడా చేస్తుంది. ఇదిలా ఉంటే శిఖర్ పహారియాతో ఆమె ప్రేమలో ఉన్నారని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి.జాన్వీ, శిఖర్ కలిసి ఎన్నోసార్లు బయట కనిపించారు. అయితే తిరుపతిలో శిఖర్ పహారియనాను జాన్వీ కపూర్ పెళ్లి చేసుకోనున్నారనే రూమర్‌ తెగ వైరల్ అయింది.ఆ రూమర్ పై తాజాగా జాన్వీ స్పందించారు.జాన్వీ కపూర్ ,శిఖర్ పహారియా వివాహం తిరుపతిలో జరగనుందంటూ ఓ ఫొటోను ఓ యూజర్ ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేయడం జరిగింది.అయితే దీనికి జాన్వీ స్పందించారు. ‘కుచ్ బీ’ అంటూ ఆ పోస్ట్‌కు జాన్వీ కామెంట్ చేసారు. ఏదైనా రాసేస్తారా అని ఆమె మండిపడ్డారు. తన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని జాన్వీ తెలిపారు.

Show comments