NTV Telugu Site icon

Janhvi Kapoor : టెంప్టింగ్ లుక్స్ తో కవ్విస్తున్న జాన్వీ..

Whatsapp Image 2023 07 21 At 9.58.52 Pm

Whatsapp Image 2023 07 21 At 9.58.52 Pm

హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి..హాట్ డ్రెస్ లో పరువాల విందు చేసింది. జాన్వీ బోల్డ్ లుక్ బాగా టెంప్ట్ చేసేలా ఉంది.జాన్వీ కపూర్ రీసెంట్ మూవీ బవాల్ జులై 21న హాట్ స్టార్ లో విడుదలైంది. బవాల్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బవాల్ విజయాన్ని జాన్వీ ఎంతగానో ఆస్వాదిస్తుంది.. ఈ మూవీ థియేటర్స్ లో విడుదలై ఉంటే జాన్వీ కెరీర్ కి బాగా ప్లస్ అయ్యేది.ఈ మూవీలో జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ లు జంటగా నటించారు. ఈ సినిమాను నితేశ్ తివారి తెరకెక్కించారు. ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. క్రిటిక్స్ నుంచి బవాల్ చిత్రంపై ప్రశంసలు అందుతున్నాయి.ప్రేక్షకుల నుంచి కూడా ఎంతో పాజిటివ్ రెస్పాన్స్ అందుతుంది.జాన్వీ తెలుగులో దేవర మూవీతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

శ్రీదేవి కూతురిగా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చినా కానీ తన టాలెంట్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది.గతంలో పలువురు దర్శకులు ఆమెను సౌత్ చిత్రాల్లో నటింపజేసే ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు.దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ హీరోయిన్ గా నటిస్తుంది..యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న దేవర సినిమా ఏడాది ఏప్రిల్ 5 న విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ కి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అందుకే స్పీడ్ గా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయనున్నారట. ఇటీవల దేవర ఫస్ట్ లుక్ కు భారీగా రెస్పాన్స్ వచ్చింది.కాగా దేవర చిత్రం కోసం జాన్వీ కపూర్ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది.ఈ చిత్రంలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. దేవర సినిమా తరువాత జాన్వీ తెలుగులో బిజీ హీరోయిన్ గా మారుతుందో లేదో చూడాలి.