తనపై ఎవరు కుట్ర చేశారో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర ఆధారాలతో సహా ఉంచుతా అని తిరుపతి జనసేన ఇన్ చార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. తాను ఏ తప్పు చేయలేదు అని పవన్ గారికి తెలిసి విచారణ చేయమన్నారని చెప్పారు. క్లీన్ చిట్‌తో మళ్లీ నేషనల్ హైవేలా దుసుకుపోతా అని ధీమా వ్యక్తం చేశారు. తన జీవితాంతం పవన్ కళ్యాణ్, మీడియాకు రుణపడి ఉంటానని అని పేర్కొన్నారు. తనకు, లక్ష్మి రెడ్డికి ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు. తిరుపతి చెందిన లక్ష్మి రెడ్డి, కిరణ్ రాయల్‌మధ్య ఆర్థిక లావాదేవీలపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
‘ఏమి జరిగినా నా మంచికే. 26 రోజులు నన్ను ఎలా తొక్కలో తొక్కారు. నా జీవితాంతంలో ఇద్దరికీ రుణపడి ఉంటాను. ఒకటి నా అధినేత పవన్ కళ్యాణ్, రెండవది మీడియా. నేను ఏ తప్పు చేయలేదు అని పవన్ గారికి తెలిసి విచారణ చేయమన్నారు. నాతో పాటు ఉన్న వాళ్ళే నన్ను నమ్మలేదు. నేను ఏ తప్పు చేయలేదు అని కొంతమంది నమ్మారు అది చాలు. నన్ను, నా పిల్లలను హింస పెట్టారు. రాజకీయాలు చేస్తే మానసికంగా తొక్కేశారు. తిరుపతిలో కాపులను రాజకీయంగా తొక్కాలని చూశారు. నాకు, లక్ష్మి రెడ్డికి ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయి. ఒక మహిళను రాజకీయాల్లో లాగి అనేక రకాల్లో హింసకు గురి చేశారు. ఆ మహిళకు ఆర్దికంగా ఆశ చూసి, ఆ మహిళ కొడుకులను బెదిరింపులకు గురి చేశారు. 26 రోజులు చాలా నేర్చుకున్నా. ఒక వ్యక్తి బాధల్లో ఉన్నప్పుడు ఇంకా వెన్నుపోటు పొడిచారు. ఒక అడ్వకేట్ అన్యాయం కోసం కోర్టులో వాదించాలి, సాక్షి టీవీలో వాదించకూడదు. నేను మండోడిని కాబట్టే నిలబడ్డా.. ఇంకవరైనా కుటుంభం మొత్తం ఆత్మహత్య చేసుకుంటారు. 26 రోజులుగా నా ఫ్యామిలీ బయటకు రాలేదు. ఒక చైన్ వేసుకుంటే ఇంత రాద్ధాంతం చేస్తారా?. వైసీపీలో రాసలీలలు, రాజాలు చాలామందే ఉన్నారు. వారు నిజాయితీ పరులా?. నాపై ఎవరు కుట్ర చేశారో పవన్ కళ్యాణ్ దగ్గర ఆధారాలతో సహా ఉంచుతా. క్లీన్ చిట్‌తో మళ్లీ నేషనల్ హైవేలా దుసుకుపోతా’ అని కిరణ్ రాయల్ చెప్పుకొచ్చారు.