Site icon NTV Telugu

Janasena: టీటీడీ ఈవోపై సీఐడీకి జనసేన ఫిర్యాదు

Janasena

Janasena

Janasena: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డిపై సీఐడీకి ఫిర్యాదు చేసింది జనసేన.. సీఐడీ కార్యాలయానికి వెళ్లిన జనసేన నేతలు.. టీటీడీ ఈవో ధర్మారెడ్డి పై ఫిర్యాదు చేశారు.. టీటీడీ ఈవో అర్హత లేకపోయినా.. వైఎస్‌ జగన్ ఆశీస్సులతో ఐదేళ్ల పాటు ఈవోగా పనిచేస్తున్నారని.. వందల కోట్లు దోచేశారని ఆరోపించారు.. అయితే, రాష్ట్రంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ధర్మారెడ్డి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీటీడీ నిధులు, శ్రీవాణి డబ్బులు వెనుకేసుకున్నారు.. టీటీడీని నాశనం చేశారు.. ప్రభుత్వం ఏర్పాటు అయిన 24 గంటలు గడవకముందే లీవ్ కావాలంటే అర్థం చేసుకోవాలని సీఐడీ దృష్టికి తీసుకెళ్లారు. సీఐడీలో కేసు రిజిస్టర్ చేసి పాస్ పోర్ట్ సీజ్ చేయాలని.. టీటీడీ లెక్కలు అన్ని కొత్త ఈవో చూసిన తరువాత అతనిని రిటైర్డ్ మెంట్ చేయాలని.. అవసరమైతే లుక్ అవుట్ నోటీసులు ఇవ్వాలని ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేసింది జనసేన పార్టీ.

Read Also: Kaleshwaram: నేడు రాష్ట్రానికి జస్టిస్‌ పీసీ ఘోష్‌.. రేపు మేడిగడ్డలో ఉత్తమ్‌ పర్యటన

Exit mobile version