Site icon NTV Telugu

Janasena Party: అంబటి రాంబాబు వ్యాఖ్యలపై జనసేన రియాక్షన్..

Janasena

Janasena

Janasena Party: అంబటి రాంబాబు వ్యాఖ్యలపై జనసేన పార్టీ రియాక్ట్ అయ్యింది. అంబటి రాంబాబు అహంకారపూరిత వ్యాఖ్యలపై, అసభ్యకర బూతులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది. “వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాక్ష్యాత్తు శ్రీవారి సొమ్ము రూ. 250 కోట్లు దోపిడీ చేయడమే కాకుండా, పవిత్రమైన శ్రీవారి ప్రసాదం లడ్డు తయారీలో ఆవు నెయ్యి బదులుగా, 68 లక్షల కేజీల కల్తీ కెమికల్ నెయ్యి వాడటమే కాకుండా, SIT రిపోర్ట్ ద్వారా 36 మంది ఈ పాపంలో భాగం అయ్యారు అని చెప్పినా సరే ప్రభుత్వంపై నిందలు వేస్తారా? మీరు చేసిన తప్పులు ప్రజలకు వివరించేలా ఫ్లెక్సీలు వేయిస్తే రౌడీయిజంతో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తారా? మీరు చేసేది తప్పు అని అడ్డుకుంటే సాక్ష్యాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద సభ్య సమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేస్తారా? అంబటి చేసినవి విమర్శలు కాదు, ఇది తప్పు చేసిన మమ్మల్ని ఏమీ చేయలేరు అనే అహంకారంతో వాగిన చిల్లర వాగుడు… YSR బూతు పార్టీ నాయకుడిగా బండ బూతులతో రెచ్చి పోయిన అంబటి రాంబాబును తక్షణమే అరెస్ట్ చేయాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవాన్ని కాపాడలేకపోతే ఇక సామాన్యులపై జరిగే దాడులను ఎలా అరికడతాం? ఒక మాజీ మంత్రిగా హుందాగా వ్యవహరించాల్సిన అంబటి రాంబాబు బజారు రౌడీలా ప్రవర్తిస్తే ప్రజలకు ఏం సందేశం ఇచ్చినట్లు? రాష్ట్ర ముఖ్యమంత్రిపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి పోలీసులు అరెస్ట్ చేయాలి.. భవిష్యత్తులో ఇలా మరే ఇతర నాయకుడు ప్రవర్తించకుండా న్యాయస్థానం కఠినంగా శిక్షించాలి.” అని జనసేన పార్టీ డిమాండ్ చేసింది.

READ MORE: Ambati Rambabu: మాజీ మంత్రి ఇంటి వద్ద క్షణక్షణం ఉద్రిక్తత.. అంబటికి ఫోన్ చేసిన వైఎస్ జగన్

Exit mobile version