Site icon NTV Telugu

Pawan Kalyan: వైసీపీ సర్కారుకు జనసేన సపోర్ట్.. రాజకీయం కంటే రాష్ట్ర శ్రేయస్సు మిన్న

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: ప్రకృతి అందాలతో అలరారే విశాఖ నగరానికి దేశ విదేశాల నుంచి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వాగతం పలుకుతోందని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. శక్తివంతమైన, అనుభవం కలిగిన ఆంధ్రప్రదేశ్ యువత మిమ్మల్ని మెప్పిస్తారని భావిస్తున్నామన్నారు. ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ ద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు.. మన యువతకు ఉపాధిని అందించే అవకాశం వస్తుందని భావిస్తున్నామని జనసేనాని పేర్కొన్నారు. ఇన్వెస్టర్లు కూడా తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలం పొందుతారని ఆశిస్తున్నామన్నారు. ఏపీలో ఆర్థిక వృద్ధికి ఉన్న అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, సముద్రతీరం వంటి వాటిని ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించాలని వైసీపీ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా విన్నవించారు.

Read Also: Seediri Appalaraju: సలహాలు ఇచ్చేది పోయి విషం చిమ్ముతావా.. చంద్రబాబుపై మంత్రి ఫైర్

రివర్స్‌ టెండరింగ్‌, మధ్యవర్తుల కమీషన్లు వంటి అడ్డంకులు ఏవీ లేకుండా పెట్టుబడి దారుల్లో నమ్మకాన్ని కలిగించాలన్నారు. ఈ సమ్మిట్‌ ఆలోచనలను కేవలం విశాఖకే పరిమితం చేయవద్దన్నారు. తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపల్లో కూడా పెట్టుబడులకున్న అవకాశాలు వివరించాలని సూచించారు. దీన్ని కేవలం ఒక నగరానికే పరిమితం చేయకుండా ఏపీ మొత్తానికి నిజమైన ఇన్వెస్టర్ల సమ్మిట్‌ లాగా మార్చాలని సూచనలు చేశారు. ఇక చివరిగా- రానున్న రెండు రోజుల్లో ప్రభుత్వంపై జనసేన ఎలాంటి విమర్శలకు చోటివ్వదన్నారు. ఇన్వెస్టర్ల సమ్మిట్‌ విషయంలో ప్రభుత్వంపై ఎటువంటి రాజకీయ విమర్శలు చేయమన్నారు.పెట్టుబడుల ఆకర్షణ అంశంలో ప్రభుత్వానికి జనసేన సహకారం అందిస్తుందన్నారు.ఇన్వెస్టర్ల సమ్మిట్‌ సందర్భంగా ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తోందన్నారు. రాజకీయం కంటే రాష్ట్ర శ్రేయస్సు మిన్న అని పవన్‌ కళ్యాణ్ అన్నారు.

 

Exit mobile version